రాష్ట్రీయం

పోరాడలేకనే పొత్తుబాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 15: పది లక్షల మంది సభ్యులతో పాటు, విస్తారమైన క్యాడర్ ఉన్నా సర్కారుపై యుద్ధం చేయలేని అరడజను మంది అగ్రనేతలే పొత్తు కోసం వెంపర్లాడుతూ పార్టీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్తు, పొత్తులు, పోరాట కార్యాచరణపై నేరుగా పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడుతోనే స్పష్టత తీసుకునేందుకు తెలంగాణ టిడిపి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జ్‌లు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో వయసు మీరి, చివరి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొందరు అగ్ర నాయకులు చంద్రబాబును తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జ్‌ల సమావేశం వాడివేడిగా జరిగింది. ఆ సమావేశంలో ప్రసంగించిన పలువురు జిల్లా అధ్యక్షులు వేదికపై ఉన్న అగ్ర నాయకులను కడిగేసినట్లు సమాచారం. పొత్తులపై మిమ్మల్ని అడిగినా ప్రయోజనం లేనందున, నేరుగా తాము బాబు వద్దే స్పష్టత తీసుకుంటామన్నారు. ‘మీరైనా సార్‌ను అడగండి. లేకపోతే మేమే అడుగుతాం. మీరంతా తలోమాదిరిగా మాట్లాడుతున్నారు. ఒకాయన కాంగ్రెస్‌తో కాదు, టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటామంటే, దయాకరేమో రేవంత్ తప్ప మిగిలిన వారంతా మావైపే ఉన్నారంటారు. అసలు పార్టీలో ఏం జరుగుతోంది? పార్టీ లైన్ ఏమిటి? టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం మీరే వెంపర్లాడుతున్నట్లుంది. ఇక్కడున్న నలుగురైదుగురు మీదారి మీరు చూసుకుంటే మరి మా రాజకీయ భవిష్యత్తేమిటి? ఎన్నికల వరకూ మేమెందుకు మోయాలి? ఎన్నికల వరకూ మేమెందుకు కొట్లాడాలి? ఎవరి కోసం, ఎందుకు కొట్లాడాలి? మరి ఎన్నికల్లో మా సీట్ల సంగతేంది? పార్టీకి లీడర్లు పోయినా క్యాడర్ ఉంది. అయినా మీరు పోరాటాలు చేయడం లేదు. క్లారిటీ ఇవ్వడం లేదు. అందుకే మేమే సార్‌ను అడిగే క్లారిటీ తీసుకుంటామ’ని వారు నిర్మొహమాటంగా చెప్పినట్లు సమాచారం. కాగా, చంద్రబాబు నాయుడు ఈ నెల 17న విదేశీ పర్యటనకు వెళుతున్నందున ఆయన వచ్చిన తర్వాత వచ్చే నెల తొలివారంలో అమరావతిలోనే కలవాలని వీరు నిర్ణయించారు.
‘అసలు పార్టీని పటిష్ఠం చేసుకుంటేనే కదా ఎవరైనా పొత్తులకొచ్చేది? అప్పుడే కదా మనం సీట్ల గురించి బేరసారాలు ఆడేది? మన దగ్గర బలం లేనప్పుడు ఎదుటివాళ్లు మనల్ని ఎందుకు లెక్కచేస్తారు? కనీసం ఎన్నికల వరకైనా పొత్తు మాట పక్కకుబెట్టి, పార్టీని విస్తరించుకుంటేనే మనకు విలువ ఉంటుందన్న చిన్న లాజిక్‌ను ఎలా మిస్సవుతున్నారో అర్థం కావడం లేదు. వీళ్లే సార్‌ను తప్పుదోవపట్టిస్తున్నారు. ఆయనకు మాత్రం తెలంగాణలో పార్టీ బలపడాలని ఉండదా? ఒకరకంగా మా అగ్ర నాయకులే సారుకు తెలంగాణ పార్టీ అంటే చికాకు తెప్పిస్తున్నార’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అవసరమైతే తాము టీఆర్‌ఎస్‌తో వెళతామని మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే ‘అసలు తెలంగాణలో టిడిపి ఎక్కడుంద’ని కెసిఆర్ ప్రశ్నించారంటే, ఎవరు ఎవరి కోసం వెంపర్లాడుతున్నారో స్పష్టమవుతోందంటున్నారు. కాగా, సర్కారుపై పోరాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న మరికొందరు అగ్ర నాయకులు రెండు వర్గాలుగా చీలిపోగా, మెజారిటీ జిల్లా అధ్యక్షులు మాత్రం రేవంత్‌రెడ్డికే మద్దతుగా నిలస్తున్నారు. సీనియర్లే వ్యూహాత్మకంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారని, నియోజకవర్గాల్లో బలం ఉన్న నేతలంతా రేవంత్ వైపే ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.