రాష్ట్రీయం

అమరుల సంస్మరణ మన విధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: దేశంకోసం, మన కోసం తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి రక్షణ కల్పిస్తున్న పోలీసుల సేవలు అమోఘమని, రక్షణలో పోలీసులే కీలకమని రాష్ట్ర గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ అన్నారు. దేశ భద్రతతోపాటు ప్రజల ధన, మాన ప్రాణాలకోసం అసువులు బాసిన పోలీసులను మనమంతా విధిగా స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం అమర పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 2కే రన్ నిర్వహించారు. తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మతో కలసి ఈ రన్‌ను ప్రారింభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలుగనివ్వమని, శాంతి స్థాపనకు తమ వంతు కృషి చేస్తామని యువకులు ప్రతిని బూనాలన్నారు. జాతి నిర్మాణానికి యువకులు పోలీసులకు సహకరించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయాల్లో, ట్రాఫిక్ ప్రమాదాలు సంభవించినప్పుడు మనల్ని కాపాడేది పోలీసులేనని, వారి సేవలను ప్రజలకు తెలియజేప్పేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. అమరులైన పోలీసులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిందేనని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి, ఆర్‌బివిఆర్‌ఆర్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్, అదనపు డిజిలు గోపికృష్ణ, అంజనీకుమార్, రవిగుప్త, గోవింద్ సింగ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచంద్రరావు, సౌమ్యమిశ్రా ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 8వేల మంది యువకులు ఈ రన్‌లో పాల్గొన్నారు.
పోలీస్ అమర సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం రెండోరోజు కూడా ఆయుధాల ప్రదర్శన కొనసాగింది. తెలంగాణవ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన ప్రదర్శనకు మంచి స్పందన లభించింది. ఈ ప్రదర్శనలో మొత్తం 21 స్టాళ్లను ఏర్పాటు చేయగా, అసోం, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్టక్రు చెందిన పోలీస్ బలగాలు కూడా పాల్గొన్నాయి. కేంద్ర, రాష్ట్రాల పోలీస్ శాఖ పనితీరు, నూతన టెక్నాలజీ, సైబర్ నేరాలపై అవగాహనతోపాటు కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు ఉపయోగించే ఆయుధాలను ఈ ప్రదర్శనలో ప్రదర్శించారు. ఆయుధాల ప్రదర్శనను తికించేందుకు వేలాదిగా తరలివచ్చారు.
చిత్రం..2కే పోలీస్ రన్‌లో పాల్గొన్న గవర్నర్ నరసింహన్, డిజిపి అనురాగ్ శర్మ తదితరులు