రాష్ట్రీయం

జూలైలోనే అంతర్జాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జనవరి 27 : భవిష్యత్తు శాస్త్ర సాంకేతిక రంగాలదేనని, ఆ దిశగా విద్యార్థులు దృష్టి సారించి దేశాన్ని ప్రపంచస్థాయిలో అగ్రస్థానానికి తీసుకెళ్ళాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం తొలిసారిగా తిరుపతిలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ అకాడమీని ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్ కుమార్‌కు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును అందజేశారు. ప్రొఫెసర్ చింతామోహన్ రావుకు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి, లక్ష్మీనారాయణ, ఏపి అకాడమీ ఆఫ్ సైన్స్ కార్యదర్శి, ఏఎన్‌యు రెక్టార్ ప్రొఫెసర్ కెఆర్‌ఎస్ సాంబశివరావులకు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థుల బృందం రూపొందించిన యామర్ అనే ట్యాబ్‌ను సిఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తన ఆలోచనలకు మిళితం చేసి ఈ ఏడాది జూలై మాసానికి ప్రతి ఇంటికి 20 ఎంబిపిఎస్ స్పీడుతో ఇంటర్నెట్ కనెక్షన్ అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా చేసే విద్యుత్తు స్తంభాల నుండి కేవలం 320 కోట్ల రూపాయలు వ్యయం చేసి ఫైబర్ కేబుల్‌ను ఆరు నెలల్లో ఏర్పాటు చేయిస్తామన్నారు. తద్వారా 20 ఎంబిపిఎస్ జూలై నాటికి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పిస్తామన్నారు. ఇందులో భాగంగానే తనకు గొప్ప రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తిరుపతి ఎస్వీ యూనివర్శిటీని పూర్తిగా అభివృద్ధి చేస్తానన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, టిటిడి కలిపి 60 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయిస్తామన్నారు. ఈ సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుండి 600 శాస్తవ్రేత్తలు హాజరయ్యారు.