రాష్ట్రీయం

పెట్టబడుల ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ నెలకొల్పడానికి అర్పీ సంజీవ్ గోయేంకా గ్రూప్ ముందుకొచ్చింది. సిద్దిపేట జిల్లా తుప్రాన్ వద్ద సుమారు 20 ఎకరాల విస్థీర్ణంలో నెలకొల్పనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఐటీ మంత్రి కె తారకరామారావు సోమవారం కలకత్తా నగరంలో పర్యటించి పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రూ.200 కోట్లు పెట్టుబడికి అంగీకరించిన అర్పీ సంజీవ్ గోయేంకా గ్రూప్ మంత్రి కెటిఆర్ సమక్షంలో ఒప్పందం చేసుకుంది. ఈ పరిశ్రమ ఇకనుంచి తమ ఈ- విటా, టూ- యమీ బ్రాండ్లను సిద్ధిపేటలో స్థాపించనున్న యూనిట్‌లోనే తయారు చేయనుంది. ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా వెయ్య మందికి ఉపాధి లభించనుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ పర్యటనలో శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ హేమంత్ కనోరియాతో కూడా మంత్రి సమావేశమయ్యారు. వౌలిక వసతుల రంగంలో భారీ పెట్టుబడులు కలిగిన శ్రేయి గ్రూప్‌నకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. హైదరాబాద్ నగరంలో చేపడుతున్న వౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. ఫుడ్ పార్క్‌ల స్థాపనకూ తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
ఇస్తుందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్క్‌లకు ఆర్థిక సహకారం అందించే అవకాశాలను పరిశీలిస్తామని హేమంత్ కనోరియా హామీ ఇచ్చారు. త్వరలో చైనీస్, కోరియా, జపనీస్ పెట్టుబడిదారులతో హైదరాబాద్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కలకత్తాలో పెట్టుబడిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నూతన పారిశ్రామిక విధానం ద్వారా పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సహకాలను, రాయితీలను మంత్రి వివరించారు. మేక్ ఇన్ తెలంగాణ నినాదంతో మ్యాన్యూ ఫాక్చరింగ్ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి వివరించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొని సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమల స్థాపనకు రెండు వారాల్లోనే అన్ని అనుమతులను ఇస్తున్న అంశాన్ని వివరించారు.

చిత్రం..అర్పీ సంజీవ్ గోయేంకా గ్రూప్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న మంత్రి కెటిఆర్