రాష్ట్రీయం

దేశభక్తిని మేల్కొలుపుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 17: ఎన్నో యుద్ధాల్లో శత్రు సైన్యంతో వీరోచిత పోరాటాల్లో పాలుపంచుకున్న టియు-142 యుద్ధ విమానం ఇక మీదట యువతలో దేశభక్తి, స్ఫూర్తిని నింపేలా సేవలందిస్తుందని సిఎం చంద్రబాబు అన్నారు. విశాఖ సాగరతీరంలో టియు-142 యుద్ధ విమాన మ్యూజియం పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికుల నిరంతర శ్రమతోనే మన హాయిగా ఉంటున్నామని, అదే స్ఫూర్తిని యువతలో నింపేలా యుద్ధ విమాన మ్యూజియంను ఏర్పాటు చేసేలా తనకు ప్రేరణగా నిలిచిందన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కురుసుర సబ్‌మెరైన్‌ను తీరానికి తీసుకువచ్చి, మ్యూజియంగా తీర్చిదిద్దానని అన్నారు. ఇప్పుడు సబ్‌మెరైన్ మ్యూజియం ఎదురుగానే యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా యువతలో దేశభక్తి స్ఫూర్తిని కలిగించాల్సి ఉందన్నారు. రష్యా సాంకేతిక సహకారంతో తయారైన టియు-142 ఆపరేషన్ పరాక్రమ్, కార్గిల్ యుద్ధాల్లో సేవలందించిందన్నారు. యుద్ధ విమాన ఘన విజయాలను యువతకు వివరించడంతో పాటు రక్షణ రంగంలో నౌకాదళం, వైమానిక దళం పాత్రను అర్ధమయ్యే రీతిలో చెప్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), రెండు విడతలుగా భాగస్వామ్య సదస్సు నిర్వహించుకున్నామన్నారు. త్వరలోనే విశాఖకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను ఆహ్వానిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. వచ్చే నెలలో బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవసాయంలో ఆధునిక విధానాలపై రెండు రోజుల పాటు సదస్సు ఉంటుందన్నారు. విశాఖను అంతర్జాతీయ తూర్పుతీరంలో విశాఖ నగరానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ముఖ్యంగా రక్షణ రంగ సంస్థలకు నిలయమైన విశాఖను ఆర్థిక, ఐటి, పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. పర్యాటకంగా విశాఖకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నామని, పర్యాటక రంగం అభివృద్ధి సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. తూర్పునౌకాదళ ప్రధానాధికారి హెచ్‌సిఎస్ బిస్త్ మాట్లాడుతూ నౌకాదళంలో 29 సంవత్సరాల పాటు సేవలందించిన యుద్ధ విమానం టియు-142 ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉందన్నారు. యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ విమానాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు
ఎంతగానో శ్రమించారన్నారు. విశాఖ సాగరతీరంలో యుద్ధ విమానం, సబ్‌మెరైన్ మ్యూజియంలను ఏర్పాటు చేయడం పర్యాటకంగా ఆకర్షణీయమన్నారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, భూమా అఖిలప్రియ, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు అధికారులు, నౌకాదళ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..టియు-142 యుద్ధవిమాన మ్యూజియం పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం యుద్ధవిమానం వద్ద సహచరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు