రాష్ట్రీయం

వచ్చే 15లోగా విజన్ డాక్యుమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి నిర్దేశించిన విజన్ డాక్యుమెంట్- 2024 రూపకల్పన పనులు చకాచకా సాగుతున్నాయి. ఈనెల 21వ తేదీలోగా ఎంపిక చేసిన ప్రభుత్వ శాఖలు ఈ నెల 21వ తేదీలోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని, వచ్చే నెల 15వ తేదీలోగా సంపూర్ణ నివేదిక ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీనాటికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్- 2024కు సంబంధించి ముసాయిదా డాక్యుమెంట్‌ను తయారు చేస్తారు. ఈ మొత్తం డాక్యుమెంట్‌ను రూపొందించే బాధ్యతను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు రాష్ట్రప్రభుత్వం అప్పగించిన విషయం విదితమే. తెలంగాణరాష్ట్రం 2014 జూన్ 2వ తేదీన అవతరించిన విషయం విదితమే. తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దీంతో 2024 విజన్ డాక్యుమెంట్ పేరిట అభివృద్ధికి మార్గనిర్దేశనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత మూడు సంవత్సరాలుగా సాధించిన అభివృద్ధి, అంతకు ముందు సమైక్య పాలనలో జరిగిన అన్యాయం, ఈ లోపాలను సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలకమైన శాఖలు నివేదికను రూపొందిస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సమతుల్యతతో నివేదికను తయారు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకివచ్చేందుకు టిఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆచరణలో ఇంతవరకు అమలుకు నోచుకున్న అంశాలు, వాటి సాధనకు ఎదురైన ఇబ్బందులు, భవిష్యత్తులో ఈ అవరోధాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై పూర్తిగా ఒక రోడ్‌మ్యాప్‌ను ప్రభుత్వం ఖరారు చేయనుంది. మంత్రులు, వివిధ శాఖాధిపతులు, ఆయా రంగ నిపుణుల సలహాలతో ఈ నివేదికను రూపొందిస్తారు. మొత్తం పది గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఆరు సంవత్సరాలకు పనివిధానాలను నిర్దేశిస్తారు. సంపూర్ణంగా ముసాయిదా డాక్యుమెంట్ తయారైన తర్వాత దీనిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు
విడుదల చేస్తారు. అనంతరం ఆయా రంగ నిపుణుల నుంచి సలహాలను కూడా ప్రభుత్వం స్వీకరించనుంది. వ్యవసాయం, ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖ, రోడ్లు భవననాల శాఖ, సంక్షేమం, విద్య, రవాణా, పరిశ్రమలు, ఐటి రంగం, మున్సిపాలిటీ, పంచాయితీరాజ్ శాఖలు ఇచ్చే సమగ్రనివేదికలను డాక్యుమెంట్‌లో చేర్చనుంది.