రాష్ట్రీయం

కెసిఆర్‌పై ఈగ వాలనివ్వరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యనమలకు 2 వేల కోట్ల కాంట్రాక్ట్ దక్కింది
నన్ను జైల్లో పెట్టిన కెసిఆర్‌కు దండాలు పెడతారా?
మీడియా ఇష్టాగోష్టిలో ఏపీ టిడిపిపై రేవంత్‌రెడ్డి ఫైర్
కెసిఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ
అన్నం పెట్టిన వారికి ఏపీ నేతలు సున్నం పెడుతున్నారు
పొత్తులపై చంద్రబాబు స్పష్టత ఇచ్చాకే తుది నిర్ణయం
టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌తో కలిసి పని చేస్తున్నానని వ్యాఖ్య
టి.టిడిపిని కుదిపేసిన రేవంత్ వ్యవహారం
ఒడిదుడుకులు సహజమేనన్న ఎల్ రమణ

హైదరాబాద్, అక్టోబర్ 18: టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి వ్యవహారం తెలంగాణ శాఖను కుదిపేయగా, రేవంత్ రెడ్డి తాజాగా చేసిన ఘాటైన వ్యాఖ్యలు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పార్టీ ఆ రాష్ట్ర శాఖనూ కలవరపరిచింది. కాగా కార్యకర్తలెవ్వరూ దిగాలు పడాల్సిన అవసరం లేదని, పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని బలంగా నిలిచిందని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు చాలాకాలంగా ప్రచారంలో ఉన్నా, ఆయన ఢిల్లీకి వెళ్ళడం, ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మంతనాలు జరిపినట్లు మీడియాలో కథనాలు రావడం, వచ్చే నెల 9న రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇలాఉండగా రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌కు రాగానే కొంత సేపు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాగా తన వ్యాఖ్యలతో ఏపీ టిడిపి నాయకులను, ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. పొత్తులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలన్నారు. టిఆర్‌ఎస్‌లో టి.టిడిపి విలీనం జరుగుతుందన్న ప్రచారంలో ఉందన్నారు. ముఖ్యంగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుపై తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు. ఏపీ మంత్రి యనమలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపించారు. కాబట్టే కెసిఆర్‌పై మంత్రి యనమల ఈగ కూడా వాలనివ్వరన్నారు. ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం కుమారుని వివాహానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వెళితే పార్టీ ఏపీ నేతలు అంతగా మర్యాద చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. ‘నన్ను జైల్లో పెట్టిన కెసిఆర్‌కు అంతగా వంగి దండాలు పెడతారా?’ అని ఆయన ప్రశ్నించారు. టి.టిడిపి మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుని వివాహం వరంగల్‌లో జరిగినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తే ఉప ముఖ్యమంత్రి కె.శ్రీహరి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితర నేతలు కనీసం పలుకరించేందుకైనా వచ్చారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పరిటాల శ్రీరాం, పయ్యావుల అల్లుడి భాగస్వామ్యంలో బీర్ల తయారీ కంపెనీకి లైసెన్సు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పార్టీలు లేవని, కెసిఆర్ వ్యతిరేకులు మాత్రమే ఉన్నారని అన్నారు. కెసిఆర్‌ను మళ్లీ సిఎం చేసేందుకు సిద్ధంగా లేమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా తాను పాదయాత్ర చేస్తానని చెప్పారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పొత్తు అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిస్తే తప్పేమిటీ? అని ఎదురు ప్రశ్నించారు. సిద్ధాంతాలు చెప్పుకునే పార్టీలు వేర్వేరు పొత్తులు పెట్టుకుంటే తప్పు లేదు కానీ టిడిపి పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని అన్నారు. కాబట్టి పొత్తుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే సమాధానంతోనే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన్ను కలవనున్నట్లు చెప్పారు. ఇలాఉండగా రేవంత్‌రెడ్డితో పాటు పార్టీలోని కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులూ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది.