రాష్ట్రీయం

పంపిణీ నష్టాలు తగ్గాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: విద్యుత్ చౌర్యరహిత రాష్ట్రంగా ఏపీని రూపొందించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంధన మంత్రి కళా వెంకటరావు అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలను పరిష్కరించేందుకు త్రిముఖ వ్యూహం అమలుకు, ‘మీ వినియోగదారులను కలవండి’ కార్యక్రమం ప్రారంభానికి నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇంధన రంగానికి చెందిన వివిధ విభాగాల అధికారులతో విజయవాడ నుంచి ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి కళా వెంకటరావు మాట్లాడుతూ విద్యుత్ పంపిణీలో నష్టాలను 9.8 శాతం నుంచి 8 శాతానికి తగ్గించామని, మరింతగా తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్ ధరను 4.63 రూపాయల నుంచి 3.75 రూపాయలకు తగ్గించటంతో ఆ రంగంలో విద్యుత్ చౌర్యం గణనీయంగా తగ్గిందని అధికారులు తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తనిఖీలు కూడా పెంచాలని, పంపిణీ నష్టాలను, చౌర్యాన్ని మరింతగా నియంత్రించాలని ఆదేశించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే చర్యల్లో భాగంగా ఫిర్యాదుల సత్వర పరిష్కార వేదిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. పంపిణీ, సరఫరా నష్టాల తగ్గింపు, ఫిర్యాదుల పరిష్కారానికి త్రిముఖ వ్యూహం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. పాడైన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవాటిని పట్టణాల్లో 24గంటల్లో, గ్రామాల్లో 48గంటల్లోపు ఏర్పాటు చేసేలా చర్యలు వేగవంతం చేస్తున్నామన్నారు. ‘మీ వినియోగదారులను కలవండి’ పేరిట జిల్లా, మండల స్థాయిల్లో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార వేగం మరింత పెరగటమే ఈ సమావేశాల లక్ష్యమని చెప్పారు. ఉజ్వల పథకం అమలులో రాష్ట్రానికి 96 మార్కులు లభించాయని మంత్రికి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. రాష్ట్రానికి సోలార్ పంపుసెట్ల కేటాయింపులను 20 వేల నుంచి 30 వేలకు పెంచాలన్నారు. బొగ్గు రవాణా నష్టాలు తగ్గించడాన్ని పరిశీలిస్తున్నామని, దీనివల్ల నిర్వహణ నష్టాలు కూడా తగ్గుతాయని ఎపి జెన్కో ఎంపి విజయానంద్ తెలిపారు. 15,450 సోలార్ పంపుసెట్ల ఏర్పాటు ద్వారా 102 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని ఆయన వివరించారు.