రాష్ట్రీయం

రేపే ఏపి ఎంసెట్ నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 27: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్ -2016) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్న త విద్యామండలి శుక్రవారం విడుదల చేయనున్నది. ఎంసెట్‌ను ఏప్రి ల్ 29న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 21వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 29న నిర్దేశిత కేంద్రాల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ఉదయం 10నుండి ఒంటిగంట వరకు, అగ్రికల్చర్-మెడిసిన్ పరీక్షను మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ సంవత్స రం కూడా ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను కాకినాడ జెఎన్‌టియుకు అప్పగించింది. బుధవారం ఎంసెట్-2016 నిర్వహణపై హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య ఎల్ వేణుగోపాలరెడ్డి పర్యవేక్షణలో సమావేశం జరిగినట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు తెలిపారు. ప్రవేశ పరీక్ష నిర్వహణ, కార్యాచరణను సభ్యులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించినట్టు ఆయన తెలిపారు.

సిఎం క్యాంప్ ఆఫీసుకు సందర్శకుల వెల్లువ

విజయవాడ, జనవరి 27: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి బుధవారం సందర్శకుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ అధికారులకు ఆదేశాలిచ్చారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం లక్ష్మీపురం నుంచి వచ్చిన మహేశ్వర రెడ్డి బ్రెయిన్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. సకాలంలో చికిత్స లభించకపోతే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. ఈ క్రమంలో ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని అతడి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి మహేశ్వర రెడ్డి వైద్య చికిత్సకు రూ.3 లక్షలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మారువాడ గ్రామానికి చెందిన దొరస్వామి (23) అనే యువకుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడి వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి రూ.2 లక్షలు మంజూరు చేశారు. కడప జిల్లా బద్వేలు ప్రాంతంలోని భావన్నారాయణపురం గ్రామం నుంచి వచ్చిన బి.లక్ష్మీదేవి, సుబ్బమ్మలు పేదరికంతో కుటుంబం గడవని పరిస్థితి ఉందని విన్నవించారు. వారికి రూ.25 వేల రూపాయలు అందించాలని సిఎం అధికారులకు సూచనలిచ్చారు.