రాష్ట్రీయం

16 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అదనంగా 16 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. కాచిగూడ-కాకినాడ పోర్ట్‌కు 8, కాచిగూడ-కృష్ణరాజపురం మధ్య మరో ఎనిమిది రైళ్లను నడిపించనుంది. ట్రైన్ నెం. 07425 కాచిగూడ-కాకినాడ పోర్టుకు ఈ రైళ్లు, నవంబర్ 3,10,17,24 తేదీలలో (శుక్రవారాలు), కాచిగూడ-కృష్ణరాజపురానికి నవంబర్ 4,11,18,25 తేదీలలో (శనివారాల్లో) నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక చార్జీలు వర్తిస్తాయి. ఈ రైళఉల మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్‌కోట్, కాకినాడ టౌన్‌లలో ఆగుతాయని ఉమాశంకర్‌కుమార్ పేర్కొన్నారు.