రాష్ట్రీయం

తెలుగుదనం ఉట్టిపడేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించాలని, అంతర్జాతీయంగా తెలంగాణ ఖ్యాతి వెల్లివిరిసేలా చూడాలని ప్రభుత్వ సలహాదారు (సాంస్కృతిక వ్యవహారాలు) కెవి రమణాచారి పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సచివాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ‘నభూతో నభవిష్యతి’ అన్న చందంగా నిర్వహంచాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారన్నారు. సిఎం ఆశయాలమేరకు ఘనంగా సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల వెబ్‌సైట్‌ను సిఎం ఇప్పటికే ప్రారంభించారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రధాన ఉత్సవాలు జరుగుతాయని, మొత్తం ఏడు వేదికలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్టవ్య్రాప్తంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలకు తెలుగులో పేర్లు ఉండేలా కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని రమణాచారి సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రాలకు ‘కోర్ కమిటీ’ సభ్యులు వెళతారని,
ఆయా రాష్ట్రాల్లో తెలుగు ప్రజల ప్రతినిధులు, ముఖ్యులతో చర్చించాలని నిర్ణయించామన్నారు. ఎల్‌బి స్టేడియంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. రవీంద్రభారతిలో ప్రపంచ తెలుగుమహాసభల కార్యాలాన్ని ప్రారంభించామని, ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే ఈ కార్యాలంతో సంప్రదించవచ్చని రమణాచారి సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఈ సభల ఏర్పాట్లపై శాఖలవారీగా సమీక్ష నిర్వహించాలని ఆ యా శాఖల అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి వెంటనే తనకు అందించాలని ఆదేశించారు. వివిధ దేశాల నుండి 500 మంది ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుండి 1000 మంది ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నామన్నారు. తెలంగాణకు చెందిన ఉపాధ్యాయులు, భాషా పండితులు, ఆచార్యులు, భాషాభిమానులు దాదాపు 5000 మంది హాజరవుతారన్నారు. నగరంలో స్వాగత తోరణాలను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సింగ్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి ఒక పండగ వాతావరణం నెలకొల్పాలన్నారు.
ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, ప్రొఫెసర్ ఎస్‌వి సత్యనారాయణ, ఆయాచితం శ్రీధర్ వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చిత్రం..ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై ఉన్నతస్థాయ సమీక్షలో సిఎస్ ఎస్‌పి సింగ్ తదితరులు