రాష్ట్రీయం

జిల్లాల్లో జనసేన ఆఫీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: హైదరాబాద్‌లో రాజకీయ కార్యకలాపాలకు, పరిపాలనకు వేర్వేరుగా కార్యాలయాలను ప్రారంభించిన జనసేన ఇక జిల్లాల వారీ పార్టీ కార్యాలయాలను తెరిచేందుకు సిద్ధమవుతోంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తృతం చేయనుంది. తెలంగాణకు హైదరాబాద్‌లోనూ, ఆంధ్రాకు అమరావతిలోనూ ప్రధాన కార్యాలయాలను ప్రారంభించింది. తెలంగాణలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో జనసేన పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పలువురు జనసేన ముఖ్య ప్రతినిధులతో చర్చించినట్టు సమాచారం. అలాగే హైదరాబాద్‌లో ఐదు ఎకరాల్లో, అమరావతిలోనూ ఐదు ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో పార్టీ శాశ్వత భవనాలను నిర్మించాలని కూడా యోచిస్తున్నట్టు తెలిసింది. పార్టీ కార్యక్రమాలతో పాటు మేథావులు, ఇతర ప్రముఖులతో చర్చలు జరిపేందుకు అనుకూలంగా వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే యువతీ యువకులు ఉపయోగించుకునేందుకు వీలుగా విజ్ఞాన కేంద్రాలుగా పార్టీ కార్యాలయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.