రాష్ట్రీయం

అమరావతి నా బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 29: ‘నాకు అమరావతి ఎంత ముఖ్యమో అనంతపురం, అమలాపురమూ అంతే ముఖ్యం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి నిర్మాణం భారంకాదు, బాధ్యతన్నారు. ‘ప్రతి జిల్లా, గ్రామం అభివృద్ధి కావాలి. భావితరాల వారికి నేనిచ్చే కానుక అమరావతి. ప్రవాసాంధ్రులు మాతృభూమి అభివృద్ధికి సహకారం అందించడానికి సంసిద్ధులయ్యారు. అమరావతిలో జరిగే ప్రతి అభివృద్ధి పథకం ప్రజలకే అంకితం. ఇప్పటివరకూ ప్రధానంగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించాం. వ్యవసాయంలోనూ విదేశీ పెట్టుబడులు సాధించేందుకు చేసిన కృషి ఫలిస్తోంది. ప్యూర్ సర్కిల్ గ్రూప్ సంస్థ ఆంధ్రలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. పెట్టుబడుల ఆకర్షణకు 24 గంటల విద్యుత్ సరఫరా కీలకమైంది’ అని అన్నారు. ప్రగతి సాధనకు సంబంధించి వివిధ అంశాలపై ఆదివారం సిఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవలి విదేశీ పర్యటనలో భాగంగా వౌలిక సదుపాయాల నిర్మాణాల్లో నాణ్యతపైనా అధ్యయనం చేశామని చంద్రబాబు వివరించారు. ‘దేశం ఏదైనా కావొచ్చు. నిర్మాణంలో ఉండగానే అమరావతిలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేయడం సంతోషాన్ని కల్గించింది’ అన్నారు రాజధాని నిర్మాణ నాణ్యతలో రాజీపడకూడదని సూచించారు. తిరుగులేని నాణ్యత కోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని సిఆర్డీఎను ఆదేశించారు. అమరావతి అభివృద్ధితోపాటు, ప్రణాళిక తీరునూ సమీక్షించారు. భవిష్యత్ తరాలకు కానుకగా నిర్మిస్తున్న రాజధానికి నిర్మాణ దశలోనే అంతర్జాతీయ ఖ్యాతి రావడం ఆనందంగా ఉందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాలో అవాంతరాలను తగ్గించేందుకు ప్రయత్నించాలన్నారు. ‘అమరావతి నిర్మాణ పూచీ నాది. రెండున్నరేళ్లలోనే నగర నిర్మాణానికి పలు నిర్ణయాలు తీసుకున్నాం. ప్రజలు బాధ్యత అప్పగించిన నేపథ్యంలో, ప్రతి అంశం వాళ్లకు తెలిసేలా కార్యక్రమాలు ఉండాలి. ప్రజాకాంక్షకు అనుగుణంగానే రాజధాని నిర్మాణం సాగాలి. భూసమీకరణ, మాస్టర్ ప్లాన్ తదితర కార్యకలాపాల్లో సిఆర్డీఎ చురుగ్గా వ్యవహరిస్తోంది’ అన్నారు. లండన్ టిఎఫ్‌ఎల్ తరహాలో క్యాపిటల్ రీజియన్ యూనిఫైడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఏర్పాటుకు కార్యాచరణపై దృష్టి పెట్టాలన్నారు. త్వరలో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విశే్వశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటి), ఎస్‌ఆర్‌ం యూనివర్శిటీల కార్యకలాపాలపై సమీక్ష జరిగింది. టెలి కాన్ఫరెన్స్‌లో మంత్రులు నారాయణ, కళావెంకట్రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఎడిసి చైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి, సిఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సిఎం ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్ ఇతర ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబు