రాష్ట్రీయం

ఉసురుతీసిన అప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరవలి, అక్టోబర్ 30: అప్పుల బాధ తాళలేక ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు సామూహికంగా గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు అదృశ్యమవ్వడం, నదివద్ద లభించిన వారి బైక్, చెప్పులు, ఆధార్ కార్డులు, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు రాసిన లేఖ ఆధారంగా మాత్రమే వారు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరుకు చెందిన చిరు వ్యాపారి బొబ్బిలి శివనాగరాజు (36), అతని భార్య నాగవరలక్ష్మి (30), కుమార్తెలు బాలమాణిక్య చంద్రిక (12), అమృతహాసిని (10) ఆదివారం రాత్రి నుంచి అదృశ్యమయ్యారు.
పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జివద్ద పార్క్‌చేసివున్న బైక్, అక్కడే ఉన్న చెప్పులు, ఆధార్ కార్డులు, లేఖను సోమవారం ఉదయం హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పెరవలి పోలీసులకు నాగ వరలక్ష్మి రాసినట్టుగా ఉన్న లేఖలో అప్పుల బాధ పడలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఉంది. ఉపాధి నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లడానికి రూ.1.8 లక్షలు అప్పుచేశామని, ఏజెంటు మోసం చేయడంతో అప్పుల పాలయ్యామని లేఖలో పేర్కొన్నారు. అప్పు ఇచ్చినవారి వేధింపులు ఎక్కువయ్యాయని, లైంగిక వేధింపులు కూడా ఎక్కువవ్వడంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. పిల్లలను వేధిస్తారని వారిని కూడా తమతో తీసుకెళ్తున్నట్టు లేఖలో ఉంది. ఆదివారం రాత్రి ఇల్లు వదిలివెళ్లిన కుటుంబం ఆచూకీ సోమవారం రాత్రి వరకు తెలియరాలేదు. బైక్‌ను పెనుగొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెనుగొండ సిఐ రాయుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ నదిలో దూకారా లేదా అనే విషయమై విచారణ చేస్తున్నామని తెలిపారు. కాగా సోమవారం రాత్రి వరకు ఎటువంటి మృతదేహాలు లభ్యం కాలేదు.

ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం (ఫైల్ ఫొటో)