రాష్ట్రీయం

శ్రీగిరికి పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 30: కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీగిరికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. అంతకంతకు భక్తులు పెరగడంతో దేవస్థానం వారు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ వేళల్లో మార్పులు చేశారు. తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతించారు. క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టారు. తాగునీరు, పాలు, అల్పాహారం అందించారు. పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక దీపాలు వెలిగించేందుకు సౌకర్యాలు కల్పించారు. కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా రాత్రి పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు దీపాలు వెలిగించారు. అనంతరం నవహారతి కార్యక్రమం వేడుకగా జరిగింది. తొమ్మిది రకాల హారతులను నదీమతల్లికి ఇచ్చారు. ఈ దృశాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.