రాష్ట్రీయం

కొలువులపై అదే మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: రాష్ట్రంలో 1.12 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిందానికి కట్టుబడి ఉంటుందని, అవసరమైతే ఒక వెయ్యి ఉద్యోగాలు ఎక్కువే భర్తీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణికి, ఎస్సీ గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ప్రశంసల జల్లు కురిపించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి సంబంధించి గువ్వల బాలరాజు, పాయం వెంకటేశ్వర్లు, గాదరి కిశోర్ కుమార్‌లు అడిగిన ప్రశ్నలకు విద్యుత్ మంత్రి జగదీష్‌రెడ్డి సమాధానం చెబుతున్నపుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జోక్యం చేసుకుంటూ దళితులకు, బిసిలు, మైనార్టీలకు, గిరిజనులకు కటాఫ్ మార్కులు మేరకు ఎలాంటి పరిమితి లేకుండా విదేశాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. గతంలో కూడా ఈ పథకం ఉండేదని అపుడు కేవలం 10 లక్షలు మాత్రమే ఇచ్చేవారని, నేడు దానిని 26 లక్షలకు పెంచామని, ఇలాంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలులో లేదని చెప్పారు. మొత్తం రాష్ట్రప్రభుత్వంలో ఉద్యోగుల సంఖ్య సుమారు నాలుగు లక్షలు మాత్రమేనని, ఎప్పటి ఖాళీలు అపుడే భర్తీ చేస్తున్నామని, అయినా ఉద్యోగాలకు సంబంధించి ఎవరైనా నిర్మాణాత్మక పంథాలో సూచనలు చేస్తే వాటిని స్వీకరించేందుకు తాము సిద్ధమేనని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ దళితుడని, ఆయన యూనివర్శిటీలో పనిచేశారని, ఆ అనుభవాలతో కమిషన్‌కు మంచి పేరు తెచ్చారని, ఆయన అమలుచేస్తున్న పథకాలను గుర్తించి యుపిఎస్‌సి సైతం స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా ఆయనను నియమించిందని పేర్కొన్నారు. అంతే తప్ప పరీక్షల్లో అక్రమాలంటూ పాత పద్ధతిలో పాత రాజకీయాలు చేయవద్దని, అవన్నీ బంద్ చేయాలని, పద్ధతిగా వ్యవహరించాలని అన్నారు. సర్వీసు కమిషన్ పరీక్షలు నిర్వహించినపుడు భారీ ఎత్తున అభ్యర్ధులుంటారని, ఇంత పెద్ద వ్యవస్థలో పొరపాట్లు జరిగితే వాటిని ఎప్పటికపుడు సరిదిద్దుకోవడం జరుగుతుందని, అంతే తప్ప దీనిని ఆసరాగా తీసుకుని ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని అన్నారు.
సభ్యులు సభా గౌరవాన్ని పెంచుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్ కింద ఈ ప్రభుత్వం ఏం చేసిందో లక్ష పేజీలతో కూడిన సమాచారాన్ని పెన్ డ్రైవ్‌లలో సభ్యులు అందరికీ అందిస్తామని ఆయన వెల్లడించారు. ఇంత వరకూ విదేశీ విద్యకు సదుపాయాన్ని 496 మంది పొందారని, ఎస్సీలకు 36.28 కోట్లు, ఎస్టీలకు 9.85 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు.
చిత్రం..అసెంబ్లీలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్