రాష్ట్రీయం

ఆకుపచ్చకూ లెక్కుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: హరితహారం కోసం ఖర్చు చేసిన ప్రతీ పైసాకు లెక్కుంది. ఆ వివరాలను, ఆడిట్ నివేదికను వారంలో శాసనసభ ముందు పెడతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అడవుల సర్వనాశనానికి కారకులైన వారే తమపై విమర్శలు గుప్పిస్తే ఎలా? అంటూ కాంగ్రెస్ ను ఎత్తిపొడిచారు. పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెట్ల పెంపకం, అడవుల పరిరక్షణకు కేవలం 130 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం మూడున్నరేళ్ల సమయంలో రూ.2008 కోట్లు చేసిందన్నారు. శాసనసభలో సోమవారం హరితహారంపై జరిగిన చర్చ సందర్భంగా విపక్షాలు చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. మెదక్ నుంచి సిద్ధిపేట వచ్చే దారిలో భయంకరమైన అడవి ఉండేది. వరంగల్‌లో ఎలాంటి అడవి ఉండేది? అప్పడున్న అడవి మాయం కావడానికి కారణమెవరు? గత పాలకులా? మూడున్నరేళ్ల కింద అధికారంలోకి వచ్చిన మేమా? అని ప్రశ్నించారు. అడవుల సర్వనాశనాకి కారణమైనవారే తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలో కలప స్మగ్లర్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను హతమార్చితే, మిగతా అధికారులకు వారి నుంచి ప్రాణభయం లేకుండా గన్‌మెన్‌లను ఏర్పాటు చేసామని సిఎం గుర్తు చేసారు. రాష్ట్రంలో అటవీ ప్రాంతం 24 శాతం ఉన్నట్టు రికార్డుల్లో ఉందని, వాస్తవానికి 24 శాతం అడవి ఉందా? అని ప్రశ్నించారు. కాగితాలకే పరిమితమైన లెక్కలు వద్దు, వాస్తవిక పరిస్థితి అర్థం చేసుకొని అడవుల సంరక్షణకు, పెంపకానికి ప్రతీ ఒక్కరు సహకరిం చాలని పిలుపునిచ్చారు.
అడవులను సంరక్షించాలని ఒకవైపు కోరుతున్నవారే మరోవైపు చర్యలు తీసుకుంటే పెడబొబ్బలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఎక్కడినుంచో వచ్చిన గుత్తికోయలు రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడి అడవులను నరకడమే పనిగా పెట్టుకుంటే అడ్డుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. అడవులను నరకడం తప్ప జీవనోపాధికి మరో మార్గం లేదా? అని ప్రశ్నించారు. అడవులను ఎవరు నరికినా కఠినంగా శిక్షిస్తామని, దీంట్లో ఎవరికీ మినహాయింపు లేదన్నా రు. అడవువుల విధ్వంసం రాష్ట్రానికి క్షేమకరం కాదన్నారు. అడవులను నరికితే కఠిన చర్యలు తీసుకోవడానికి అన్ని పక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి
కోరారు. గతంలో బాధ్యతగల ప్రభుత్వాలు బాధ్యతలను విస్మరించడం నేటి విపత్తులకు కారణమన్నారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అటవీ భూములన్నీ వెనక్కి రావాలన్నారు. అడవుల సంరక్షణకు తగిన సిబ్బంది లేకపోవడంతో కొత్తగా 2800 పోస్టులను భర్తీ చేయబోతున్నామన్నారు. గతంలో ఫారెస్ట్ సిబ్బందికి కేవలం 237 వాహనాలు ఉంటే, తమ ప్రభుత్వం వచ్చాక 2143 వాహనాలను కొత్తవి కొనుగోలు చేసి ఇచ్చిందన్నారు. అడవుల సంరక్షణకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.1500 కోట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద మురిగిపోతుంటే, ఈ విషయాన్ని పలుమార్లు ప్రధాని దృష్టికి, నీతి అయోగ్ సమావేశంలో వత్తిడి చేయడం వల్ల రూ.306 కోట్ల చొప్పున రూ.700 కోట్లు సాధించుకొచ్చామన్నారు. జాతీయ ఉపాధి పథకం, కేంద్ర క్యాంపా పథకాల కింద కేటాయించిన నిధులతో పాటు రాష్ట్రం రూ.800 కోట్లు మొత్తంగా రూ.2008 కోట్లు ఖర్చు చేసామన్నారు. ఈ నిధుల గురించి గత ప్రభుత్వాలు ఎప్పుడైనా పట్టించుకున్నాయా? అని ప్రశ్నించారు. అడవుల సంరక్షణ కోసం అన్ని పక్షాలతో కలిపి సభా సంఘం ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో మొక్కల పెంపకంపై నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మున్సిపల్ మంత్రి కెటిఆర్‌కు సిఎం కెసిఆర్ సూచించారు.