రాష్ట్రీయం

రక్తమోడిన రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, అక్టోబర్ 30: హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని బాహుపేట సమీపంలో ఆర్టీసీ వజ్ర బస్సు ఆటోను ఢీకొట్టింది.
ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే, వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం రాత్రి 8గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. వరంగల్ ఆర్టీసీ డిఫోకు చెందిన టిఎస్ 03 జెడ్ 0348 నంబరుగల వజ్ర బస్సు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా, యాదగిరిగుట్ట మండలంలోని బాహుపేట జాతీయ రహదారిపై ఆలేరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఏపీ 28 వై 9257 నెంబరుగల ఆటోను ఢీకొంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పడం వల్లే ప్రమాదం సంభవించినట్టు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఆటోలో ప్రయాణిస్తున్న 9మందిలో డ్రైవర్ సహా ఐదుగురు సంఘటనా ప్రాంతంలోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రగాయాల పాలవ్వడంతో, చికిత్స నిమిత్తం వారిని జనగామ ఏరియల్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమించటంతో, అక్కడి నుంచి హుటాహుటిన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో పూలమ్మ, యాదమ్మతోపాటు రమేష్, శ్రీను, కృష్ణ ఉన్నారు. గాయపడినవారిలో గూడెపు స్రవంతి (25), అక్షయ్ (6), వెంకటేష్ (35), పాపయ్య (55) ఉన్నారు. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘోర ప్రమాదంతో బాహుపేట వద్ద జాతీయ రహదారి భయానకంగా తయారైంది.

చిత్రం..బాహుపేట వద్ద వజ్ర బస్సు ఢీకొనడంతో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు