రాష్ట్రీయం

కాళేశ్వరం ప్రాజెక్టు హైడ్రాలిజీకి ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రధానమైన హైడ్రాలజీకి అనుమతి లభించింది. కేంద్ర జల సంఘం నుం చి ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు ఇది చెంపపెట్టని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మేడిగడ్డ వద్ద 75 శాతం 284.30 టిఎంసి నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం తన హైడ్రాలజీ క్లియరెన్స్‌లో పేర్కొంది. నీటి లభ్యత మేరకు సాగునీరు, మంచినీటి అవసరాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించుకోవచ్చని కేంద్ర జల సంఘం సూచించింది. కాళేశ్వరం మొదటి దశకు ఇటీవల అటవీ అనుమతి లభించిన విషయం తెలిసిందే. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పాత ప్రాజెక్టేనని ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కొనసాగింపేనని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒకొక్కటిగా అన్ని అనుమతులు లభించడంపట్ల మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.