రాష్ట్రీయం

మార్గదర్శకాలు పాటించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: తెలుగు రాష్ట్రాల్లోని జడ్జీలు, న్యాయాధికారుల నియామకం, విభజన విషయంలో ఉమ్మడి హైకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను అందరూ పరిగణనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ జడ్జీల అసోషియేషన్ సుప్రీం కోర్టు ముందు వాదనలు వినిపించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని జడ్జీలు, న్యాయాధికారుల కేడర్ విభజన, నియామకాలపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నాజీర్‌లతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం వాదనలు కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ జడ్జీల అసోషియేన్ తరపున న్యాయవాదులు ఆదినారాయణరావు, రాజగోపాలరావు వాదనలు కొనసాగిస్తూ- హైకోర్టు పరిధిలో జడ్జీలు, న్యాయాధికారులు పనిచేయాల్సి ఉన్నందున హైకోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని వాదించారు. ఏపీ విభజన చట్టానికి, న్యాయాధికారుల కేడర్ విభజనతో ముడిపెట్టాల్సిన అవసరం లేదని, న్యాయాధికారుల నియామకాల్లో ఉమ్మడి హైకోర్టు పాత్ర తగ్గించకూడదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. విచారణ గురువారం కూడా కొనసాగనుంది.