రాష్ట్రీయం

టీచర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా యూనిట్‌గా టీచర్ పోస్టుల భర్తీలో న్యాయ అంశాలను ప్రశ్నిస్తూ కె బాలకృష్ణ ముదిరాజ్, కె భాను, రామమోహనరెడ్డిలు దాఖలు చేసిన పిటీషన్లను జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు కొట్టి వేశారు. అక్టోబర్ లో జారీ చేసిన జీవో 25 ప్రకారం కొత్తగా ఏర్పడిన జిల్లాలు యూనిట్‌లుగా తీసుకుని ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోందని, అది రాష్టప్రతి ఉత్తర్వులకు విరుద్ధమని పిటీషనర్లు పేర్కొన్నారు. రాష్టప్రతి ఉత్తర్వులు జిల్లా క్యాడర్ పోస్టులకు వర్తించవని అడ్వకేట్ జనరల్ డి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఎజి వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి పిటీషన్లను కొట్టివేశారు.