రాష్ట్రీయం

ఎవరికి ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: కృష్ణా జలాలను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పంపకం చేసే అంశంపై శనివారం కృష్ణాబోర్డు సమావేశమై ఈ ఏడాది నీటి వినియోగం కేటాయింపులు ఖరారు చేయనుంది. 270 టిఎంసి నీరు కావాలని ఆంధ్ర, 150 టిఎంసి నీరు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే ఇండెంట్ పెట్టాయి. నాగార్జునసాగర్ కుడి, ఎడమకాల్వలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నీటిని రోజుకు ఐదు క్యూసెక్కుల చొప్పున విడుదల చేసింది.
ఈ ఏడాది రబీ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని నాగార్జునసాగర్ ఆయకట్టుకింద ఉన్న 22లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేయాలని ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలు ఇండెంట్‌లో కోరాయి. తెలంగాణ పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టుకింద 6.25 లక్షల ఎకరాలు, ఆంధ్ర పరిధిలో సాగర్ ఆయకట్టు కింద 15 లక్షల ఎకరాలు ఉన్నాయి. కృష్ణాబోర్డు ముందుగా మంచినీరు, ఆ తర్వాత సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి కేటాయింపులను ఖరారు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుకు 84 టిఎంసి, హంద్రీనీవా ముచ్చుమర్రి స్కీంకు 25 టిఎంసి, సాగర్ కుడికాల్వకు 96 టిఎంసి, సాగర్ ఎడమకాల్వకు 27 టిఎంసి, కృష్ణా డెల్టాకు 38 టిఎంసి నీరు కలిపి మొత్తం 270 టిఎంసి నీటిని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద సాగు కోసం 34.5 టిఎంసి, జోన్-2 కింద 20 టిఎంసి, ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమ కాల్వకు 30 టిఎంసి, హైదరాబాద్ మంచినీటి అవసరాలకు 14 టిఎంసి, మిషన్ భగీరథ కింద 15 టిఎంసి, కల్వకుర్తి రబీ వ్యవసాయం కింద 25 టిఎంసి నీరు కేటాయించాలని కోరింది. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణాబేసిన్‌కు ఆంధ్రప్రదేశ్ తరలిస్తుండడం వల్ల నాగార్జునసాగర్‌లో అదనంగా 45 టిఎంసి జలాలను తెలంగాంకు కేటాయించాలని ఇప్పటికే ఆ రాష్ట్రప్రభుత్వం కృష్ణాబోర్డును
కోరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 215 టిఎంసికి 197.46 టిఎంసి, నాగార్జునసాగర్ జలాశయంలో 312.05 టిఎంసికి 274 టిఎంసి నీటి నిల్వ ఉంది. కృష్ణాబోర్డు శ్రీశైలం జలాశయంలో కనీసం నీటి మట్టం 854 అడుగులు, నాగార్జునసాగర్‌లో 510 అడుగులు ఉండాలని రెండు రాష్ట్రప్రభుత్వాలను గతంలోనే ఆదేశించింది.