రాష్ట్రీయం

జనంలోకి వెళ్లండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణలో టిడిపికి బ్రహ్మాండమైన, అద్భుతమైన భవిష్యత్తు ఉందని, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన సమయంలో రాజకీయ వ్యూహాలను ఆవిష్కరిస్తానని, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రజాసమస్యల సాధనకు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చా రు. గురువారం ఇక్కడ ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన తెలంగాణ టిడిపి కార్యకర్తల విస్తృత స్ధాయి సమావేశంలో మాట్లాడుతూ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో రెండు నుంచి మూడువేల ఓట్లువచ్చినా తాను అధైర్యపడలేదని, పది సంవత్సరాల పాటు ప్రతిపక్షనాయకుడిగా పోరాడిన అనుభవం తనకు ఉందని చెప్పారు. గత ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తుతో రాష్ట్రంలో పోటీచేశామని, 15 సీట్లు టిడిపికి, ఐదు సీట్లు బిజెపికి వచ్చాయన్నారు. భవిష్యత్తులో అవసరమైన సమయంలో ఎన్నికలప్పుడు ఎలా వ్యవహరించాలనేదానిపై రాజకీయవ్యూహాలు వెల్లడిస్తామని చెప్పారు. రాజకీయంగా ఎలా మసులుకోవాలనే విషయం చెప్పి చేయకూడదని ఆయన అన్నారు. ఎప్పుడు
ఏ వ్యూహం అమలుచేయాలో తనకు తెలుసన్నారు. టిడిపి జెండా, బలహీనవర్గాల అజెండా అని కార్యకర్తలతో కలిసి ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అంకితభావంతో పనిచేస్తానని ఆయన అన్నారు. తనకు, పార్టీ కార్యకర్తల మధ్య ఉన్న అనుబంధం శాశ్వతం అని, అధికారం కోసం కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చామన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు టిడిపి ఉంటుందన్నారు.సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లన్నారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చెందిందంటే, టిడిపి వల్లనేనన్నారు. హైటెక్ సిటీని తాను నిర్మించానన్నారు. విభజయ సమయంలో రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేశామన్నారు. రెండు ప్రాంతాల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నాలరు. పార్టీలో వ్యక్తిగత విద్వేషాలకు తావులేదన్నారు. ప్రజా సమస్యలే అజెండా, బడుగు, బలహీనవర్గాలకు అండగా ఉంటామన్నారు. హైదరాబాద్‌లో గతంలో నెలల తరబడి కర్ఫ్యూ ఉండేదని, టిడిపి అధికారంలో ఉన్నందు వల్ల మతసామరస్యం నెలకొందన్నారు. దశా, దిశ నిర్దేశం టిడిపికి కొత్త కాదన్నారు. సంక్షోభాలను అవకాశంగా మలుచుకుని ముందుకు సాగాలని, నిరంతరం ప్రజాసేవ చేస్తే ప్రజలే టిడిపిని గెలిపించుకుంటారన్నారు. నేతలు, కార్యకర్తలు సమన్వయంతో కార్యక్రమాన్ని తయారు చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి కమిటీకి పనిచెబుదామన్నారు. పనిచేసే నేతలకు తోడ్పాటు అందిస్తామన్నారు. కార్యక్రమాల నిర్వహణపై ప్రతినెల సమీక్షలు నిర్వహించుకుందామన్నారు. వీలైనంత వరకు ఎక్కువ సమయం తెలంగాణలో టిడిపిని పటిష్టం చేసేందుకు కేటాయిస్తామన్నారు. తన వద్ద పార్టీని పటిష్టం చేసేందుకు వ్యూహాలు ఉన్నాయని, ఎప్పుడు ఏమి చేయాలో తనకు వదిలిపెట్టాలన్నారు. ప్రజల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. కార్యకర్తలు చేపట్టే పనుల్లో భాగస్వామ్యం అవుతామన్నారు. రాజకీయాల్లో సమస్యలు ఇబ్బందులు ఉంటాయని, పరిస్థితులకు అనుగుణగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక్కడి నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తామన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆవేశంతో, ఉద్వేగంతో కార్యకర్తలు ఇక్కడికి వచ్చారన్నారు. టిడిపి బలహీనవర్గాల కోసం హైదరాబాద్‌లోనే పుట్టిందన్నారు. మహానాయకుడు ఎన్టీరామారావు ఆత్మ ఇక్కడే ఉందని, ప్రజల నుంచి పార్టీని ఎవ్వరూ వేరు చేయలేరన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, మోత్కుపల్లి నర్సింహులు, రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎంపి నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..తెలంగాణ టిడిపి కార్యకర్తల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు