రాష్ట్రీయం

జాప్యం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: మిడ్‌మానేరు ప్రాజెక్టును సకాలంలో 2018 మార్చి నాటికి పూర్తి చేస్తామని సాగునీటి మంత్రి టి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించారని, 25 ఏళ్లపాటు ఆ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైతే తాము మూడేళ్లలో దానిని శరవేగంగా పూర్తి చేసే చర్యలు చేపట్టామని అన్నారు. శాసనసభలో గురువారం నాడు రసమయి బాల కిషన్, బోడిగ శోధభ, రమేష్ చెన్నమనేని అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం చెప్పారు. మిగిలిన కట్టడాలకు చెల్లింపులు, ముంపునకు గురైన గ్రామాల ప్రభావిత పిడిఎఫ్‌లకు, ఆర్ అండ్ ఆర్ చర్యల నిమిత్తం తగినంత నిధులను బడ్జెట్‌లో కేటాయించామని అన్నారు. పనులను అత్యంత ప్రాధాన్యతపై నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంఎంఆర్ పూర్తయిన తర్వాత , మానకొండూరు, కరీంనగర్, చొప్పదండి, హుస్నాబాద్ , సిద్ధిపేట, జనగాం, స్టేషన్ ఘనాపూర్, సిరిసిల్ల నియోజకవర్గాల పరిధిలో మిడ్ మానేరు కాలువల ద్వారా రెండు లక్షల ఎకరాలకు ఆయకట్టు అందిస్తామని అన్నారు. దీనికి అదనంగా కాళేశ్వరం ప్రాజెక్టు, ఎంఎంఆర్ ప్రధాన బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్‌గా ఉండటమేగాక, సిరిసిల్ల, మేముల వాడ, చొప్పదండి శాసనసభ నియోజకవర్గాల్లో 18 మండలాల్లోని 466 జనావాసాలకు వర్తింపు అయ్యేలా మిషన్ భగీరథ పథకం కోసం వనరుగా ఉంటుందని చెప్పారు. పనులకు 639 కోట్లు వెచ్చించగా, భూసేకరణ ఇతరత్రా పనులకు 1771 కోట్లు ఖర్చు చేశామని అన్నారు.