రాష్ట్రీయం

6లోగా వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: ఈ నెల 6వ తేదీలోపల మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శ్రీ్ధర్‌బాబుపై నమోదు చేసిన కేసు వివరాలు సమర్పించాలని చిక్కడపల్లి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శ్రీ్ధర్‌బాబు పెట్టుకున్న దరఖాస్తును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ విచారించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, ఎన్‌డిపిఎస్ చట్టం కింద పోలీసులు తన పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. ఫోన్ సంభాషణలను పరిగణనలోకి తీసుకుని కేసు నమోదు చేశారని, అరెస్టు చేస్తారనే ఆందోళనతో తన పిటిషనర్ ఉన్నారని కోర్టుకునివేదించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి రామిరెడ్డి ఈ వాదనలను తోసిపుచ్చుతూ, పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారన్నారు. ఈ కేసు వివరాలను కోర్టుకు చిక్కడపల్లి పోలీసులు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
కేంద్రం, ఇరు రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
పెట్రోలు పంపుల నిర్వహణకు సంబంధించి ఆయిల్ కంపెనీల చట్టాల్లో సవరణలను తేవడాన్ని సవాలు చేస్తూ అసోసియేషన్స్ ఆఫ్ ఆయిల్ డీలర్ల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై స్పందించాల్సిందిగా ఆంధ్ర, తెలంగాణ, కేంద్రప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌వి భట్ విచారించారు.