రాష్ట్రీయం

ఉద్యోగుల విభజనలో ఏకపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: రాష్ట్ర విభజన సందర్భంగా సచివాలయ సహాయ సెక్షన్ అధికారి, సెక్షన్ అధికారి ఉద్యోగుల విభజనలో ఎపి ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరించిందని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆరోపించింది. విభజన మార్గదర్శకాలు రూపొందించే సమయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల సూచనలను పట్టించుకోలేదని యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు గిరి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 220 మంది నాలుగో తరగతి తెలంగాణ ఉద్యోగులు ఎపికి వెళ్లారని తెలిపారు. వీటిని సరి చేసి ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలో పని చేసే విధంగా చొరవ చూపాలని డిమాండ్ చేశారు.