రాష్ట్రీయం

రోశయ్యపై పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: అమీర్‌పేట భూములకు సంబంధించి మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యపై కె.మోహన్ లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. న్యాయమూర్తి రంజన్ గోయల్‌తో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన అనంతరం కేసును ఆరు నెలలపాటు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అమీర్‌పేట మైత్రీవనంలోని 9.14 ఎకరాల భూమిని ప్రజాప్రయోజచాలకోసం సేకరించి భూ యజమానులకు నష్ట పరిహారం కూడా చెల్లించింది. రోశయ్య సిఎంగా ఉన్నప్పుడు ప్రజాప్రయోజనాలకోసం సేకరించిన ఈ భూమిని తిరిగి భూయజమానికి అప్పగిస్తూ 2010లో జిఓ జారీ చేయటం తెలిసిందే. భూ యజమానులకు ఇచ్చివేయటం వెనక కుంభకోణం ఉన్నదంటూ మోహన్‌లాల్ అనే న్యాయవాది ఏసిబి ప్రత్యేక కోర్టులో కేసు దాఖలు చేశారు.