రాష్ట్రీయం

కేంద్రం నిధుల పేరిట ఎమ్మెల్సీకి టోకరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 9: ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని వంచనకు పాల్పడుతున్న బాలాజీనాయుడు అనే ఘరానా మోసగాడు పన్నిన ఉచ్చులో నిజామాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ ఆకుల లలిత కకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు నమ్మించి, ఆమె నుంచి సదరు మోసగాడు 10 లక్షల రూపాయలను దండుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలోనూ ఇదే తరహాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, సినీ నటుడు బాలకృష్ణను కూడా బాలాజీనాయుడు బోల్తాకొట్టించినట్టు తెలిసింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డిని కూడా మోసగించేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.
ఆంధ్రా ప్రాంతానికి చెందిన బాలాజీనాయుడు రామగుండం ఎన్‌టిపిసిలో పనిచేయగా అక్రమాలకు పాల్పడ్డాడని విధుల నుండి తొలగించారు. అప్పటినుండి ప్రజాప్రతినిధులను టార్గెట్‌గా చేసుకుని మోసాలు చేస్తున్నాడు. గత సెప్టెంబర్ 12న ఆకుల లలితకు ఫోన్ చేసి తాను ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శినంటొ మాట్లాడుతున్నానని తెలిపాడు. ఎమ్మెల్సీ కోటా కింద కేంద్ర ప్రభుత్వం నుండి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, వాటిని కేటాయించుకునేందుకు ఇదే ఆఖరు తేదీ అని నమ్మబలికాడు. ఆ నిధులు కావాలంటే 5 శాతం మార్జిన్ మనీ రూపంలో 10 లక్షల రూపాయలను ప్రభుత్వ ఖాతాలో ముందుగా జమ చేయాల్సి ఉంటుందని సూచించాడు. ఆ సమయంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత తన తల్లికి వైద్య చికిత్సల కోసం ఆసుపత్రిలో ఉన్నారు. దీంతో ఆమె విషయాన్ని తన భర్త ఆకుల రాఘవేందర్‌కు తెలపడంతో, ఫోన్ ద్వారా ఆయన బాలాజీనాయుడును సంప్రదించారు. ఆ మోసగాడు ఎమ్మెల్సీ భర్తను కూడా తాను ప్రిన్సిపల్ సెక్రటరీనని నమ్మించగలిగాడు. రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరవుతున్నాయనే నమ్మకంతో ఆకుల రఘు తన మేనేజర్ ద్వారా బాలాజీ నాయుడు చెప్పిన బ్యాంకు అకౌంట్‌లోకి 10 లక్షల రూపాయలను డిపాజిట్ చేశారు. ప్రభుత్వ నిధులేవీ మంజూరు కాకపోవడంతో అనుమానం వచ్చిన ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఆమె భర్త రాఘవేందర్ తాము డబ్బులు డిపాజిట్ చేసిన అకౌంట్ గురించి ఆరా తీయడంతో అది ప్రభుత్వ అకౌంట్ కాదని తేలింది. తాము మోసపోయామని గుర్తించిన ఎమ్మెల్సీ ఆకుల లలిత అదే సమయంలో హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము డిపాజిట్ చేసిన డబ్బులను రెండు రోజుల్లోనే తిరిగి రాబట్టుకోగలిగామని ఎమ్మెల్సీ భర్త తెలిపారు. మోసం జరిగినట్టు గుర్తించిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, బ్యాంకు అకౌంట్ వివరాలను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకుని, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్పను ఫోన్‌లో సంప్రదించి విషయాన్ని వివరించామన్నారు. అక్కడి హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు సత్వరమే స్పందించి బ్యాంకు అకౌంట్‌ను సీజ్ చేసి, 10 లక్షల రూపాయలను తమకు వెనక్కి పంపించారని, ఆ అకౌంట్‌ను నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారని చెప్పారు. బాలాజీ నాయుడును రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారని రాఘవేందర్ వివరించారు.