రాష్ట్రీయం

హైకోర్టు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన 31 కొత్త జిల్లాలకు సంబంధించి వివాదాలు పరిష్కారమయ్యే వరకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ (టెట్)ను నిర్వహించవద్దని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని, తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను ఆదేశించింది. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాలను ఒక యూనిట్‌గా పరిగణించడానికి ప్రాతిపదికను తెలియచేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రూల్స్‌కు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ జి అరుణ్‌కుమార్, మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టుతాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడినన ధర్మాసనం విచారించింది. 31 కొత్త జిల్లాలను లోకల్ ఏరియాగా, నియామమకానికి విద్య, నివాసం అంశాలను రాష్ట్రం యూనిట్‌గా తీసుకోవడాన్ని పిటిషనర్లు సవాలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్ రాహుల్ రెడ్డి వాదనలు వినిపస్తి 1975లో రాష్టప్రతి జారీ చేసిన ఉత్తర్వులు, రాజ్యాంగంలోని 371-డి అంశాలను ఉల్లంఘించి ప్రభుత్వం టెట్ నిబంధనలను నోటిఫై చేసిందని కోర్టుకు తెలిపారు. రాష్టప్రతి ఉత్తర్వులు రాష్ట్రంలోని పాత పది జిల్లాలను ఉద్దేశించి రూపొందించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సెకండరీ గ్రేట్ టీచర్లను పది జిల్లాలను పరిగణనలోకి తీసుకుని , వీటిని యూనిట్‌గా పరిగణించి టీచర్లను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జిల్లాల్లో స్ధానిక నివాసి అనే అంశణపై అనేక ప్రశ్నలు అడిగింది. రాష్టప్రతి ఉత్తర్వులు పది జిల్లాలకు సంబంధించి ఉండగా, రాష్ట్రంలో 31 జిల్లాలను యూనిట్‌గా ప్రభుత్వం ఎలా పరిగణిస్తుందని హైకోర్టు రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను అడిగింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, టీచర్ పోస్టులు జిల్లా కేడర్ పోస్టులని, రాష్టప్రతి ఉత్తర్వులు జిల్లా కేడర్ ఉద్యోగాల నియామకానికి వర్తించవన్నారు. రాష్టప్రతి ఉత్తర్వులకు లోబడి మాత్రమే జిల్లాల సంఖ్యను పెంచారని, జిల్లాల సంఖ్యను తగ్గిస్తే రాష్టప్రతి ఉత్తర్వులను ఉల్లంఘించినట్లవుతుందన్నారు. జిల్లాల సంఖ్యను పెంచడం వల్ల స్థానిక అభ్యర్ధులపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. సుప్రీం కోర్టు ఉత్తరుర్వల మేరకే టెట్ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఈ నెల 30వ తేదీ దరఖాస్తులు స్వీకరించేందుకు ఆఖరు తేదీ అని, పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనిర్వహిస్తారన్నారు. కాని అడ్వకేట్ జనరల్ అభిప్రాయంతో హైకోర్టు ఏకీభవించలేదు. అభ్యర్ధి తాను పాత జిల్లాకు సంబంధించిన వాడినని ప్రస్తావించేందుకు తగిన అవకాశం దరఖాస్తులో ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో, జిల్లాల పునర్విభజన పరిపాలన సౌలభ్యం కోసమని, అంతేకాని రిక్రూట్‌మెంట్ల నిమిత్తంకాదని ప్రస్తావించిన అంశాన్ని హైకోర్టు ఉదహరించింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ టెట్ దరఖాస్తు ఫారం వివరాలు, ఇతర సందేహాల నివృత్తి చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై విచారించాల్సిన అవసరం ఉందంటూ, ఈ కేసు విచారణను సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.