రాష్ట్రీయం

స్వచ్ఛ్భారత్ కల సాకారం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 10: మహాత్మాగాంధీ 150 జయంతి 2019 అక్టోబర్ 2నాటికి దేశవ్యాప్తంగా 14 మిలియన్ మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా స్వచ్ఛ్భారత్ మిషన్ పనిచేస్తోందని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖల కార్యదర్శి వి.రాధ స్పష్టం చేశారు. విశాఖలో రెండు రోజులపాటు జరిగే కలెక్టర్ల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు స్వచ్ఛ్భారత్ సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చించామన్నారు. మహాత్ముడు కలలు కన్న స్వచ్ఛ్భారత్‌ను సాకారం
చేసే బాధ్యత జిల్లాలకు సారధ్యం వహించే కలెక్టర్లపైనే ఉందన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించేలా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణకు మంచి మార్గం చూపాలనే లక్ష్యంతో స్వచ్ఛ్భారత్ మిషన్ ఏర్పాటైందన్నారు. స్వచ్ఛత సాధనలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమిస్తూ స్వచ్ఛ్భారత్ సాధనకు ఇటువంటి సదస్సులు దోహదం చేస్తాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.జవహర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రాజకీయ, సామాజిక ప్రతినిధులు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్యమస్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. స్థానిక నాయకులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను చైతన్య పరిస్తే స్వచ్ఛ్భారత్ లక్ష్య సాధన సులభతరమవుతుందన్నారు. స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ మిషన్ డైరెక్టర్ మురళీధర్ మాట్లాడుతూ 2018 మార్చి నాటికి రాష్ట్రాన్ని సంపూర్ణ బహిరంగ మలవిసర్జన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాయమన్నారు. కార్యక్రమంలో 14 రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..స్వచ్ఛ్భారత్‌పై కలెక్టర్ల సదస్సులో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న
పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి