రాష్ట్రీయం

దేశంకాని దేశంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కుషాయిగూడ, నవంబర్ 10: మలేషియా చూద్దామంటూ విహారయాత్రకు వెళ్లిన కాప్రావాసి అక్కడే దారుణ హత్యకు గురవ్వడంతో, కుటుంబానికి విషాదయాత్రగా మిగిలింది. దీంతో ఎఎస్ రావునగర్ మహేష్‌నగర్ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం ఎఎస్ రావునగర్‌లోని మహేష్‌నగర్ కాలనీకి చెందిన వాసుదేవ్ రాజ్‌పుత్ (28) విహారయాత్ర కోసం ఇద్దరు స్నేహితులతో అక్టోబర్ 28న మలేసియాకు వెళ్లారు. అక్టోబర్ 30న మలేసియాలో వాసుదేవ్ కిడ్నాప్‌నకు గురయ్యాడు. 30 లక్షలు డిమాండ్ చేస్తూ వాస్‌దేవ్ అన్న రామ్‌సింగ్ దుండగుల ముఠా సంక్షిప్త సమాచారం పంపించింది. తమ దగ్గర అంత డబ్బు లేదని, తమ తమ్ముడిని విడిచిపెట్టాలని ప్రాధేయపడినా దుండుగులు పట్టించుకోలేదు. వాసుదేవ్‌ను ఒక గదిలో బంధించి చిత్ర హింసలకు గురి చేస్తున్నట్టు దూరవాణి వీడియోలు పంపించారని కుటుంబీకులు బోరుమన్నారు. గత కొన్ని రోజులుగా చిత్రహింసలకు గురిచేసినా, తాము డబ్బు చెల్లించలేమని ఫోన్‌లోనే చెప్పడంతో వాసుదేవ్‌ను దారుణంగా హత్య చేసినట్టు కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు.
శోక సంద్రంలో కుటుంబం
వాసుదేవ్ హత్యతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. దేశంకాని దేశానికి విహారయాత్రకు వెళ్లి, హత్యకు గురికావడంతోకన్నీటి పర్యంతమైయారు. మలేషియలో హత్యకు గురైన వాసుదేవ్ మృతదేహన్ని స్వదేశానికి తెచ్చేందుకు సహకరించాలని కుటుంబీకులు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దర్యాప్తు చేస్తామని సిఐ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సిఎం కేసీఆర్ సహకరించాలని కుటుంబీకులు విజ్ఞప్తి చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి మృతదేహన్ని తమకు అప్పగించేలా చొరవ తీసుకోవాలని కుటుంబీకులు కోరారు.

చిత్రం....మలేషియాలో కిడ్నాప్ చేసిన దుండగులు వాసుదేవ్‌ను తాళ్లతో బంధించినప్పటి చిత్రం