రాష్ట్రీయం

ప్రగతి పురపాలిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ షాద్‌నగర్, నవంబర్ 10: రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.2500కోట్లు మంజూరు చేశామని సిఎం కె చంద్రశేఖర్‌రావు వివరించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తరువాత ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. మున్సిపాలిటీలను అభివృద్ది చేసే క్రమంలో 2.5వేల కోట్లను కేటాయించి, కొత్తగా ఏర్పడిన షాద్‌నగర్ వంటి మున్సిపాలిటీల అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందని, వీటిని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షిస్తారని తెలిపారు. పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రూ.2500 కోట్లు మంజూ రు చేశామన్నారు. కేటీఆర్ పర్యటించి సమస్యల సాధన కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని, త్వరలోనే షాద్‌నగర్‌లో పర్యటిస్తారని తెలిపారు. రూ.35వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం (కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లి) పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టామని వివరించారు. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. లక్ష్మీదేవ్‌పల్లి ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు జిల్లాను పచ్చగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా పనుల్లో వేగం పెంచుతున్నట్లు తెలిపారు. రెండేళ్లల్లో
ప్రాజెక్టును పూర్తి చేసి 20లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. జడ్చర్ల నియోజకవర్గం ఉదండపూర్ నుండి లక్ష్మీదేవ్‌పల్లికి కృష్ణానది నీటిని తీసుకువచ్చి అక్కడి నుండి మహేశ్వరం మీదుగా ఇబ్రహీంపట్నం వరకు తీసుకురానున్నట్లు తెలిపారు. షాద్‌నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
కొత్తూరుకు మరిన్ని కొత్త పరిశ్రమలు
కొత్తూరు పారిశ్రామిక వాడకు మరిన్ని కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడంతోపాటు పరిశ్రమల స్థాపనకు పెద్దపీఠ వేసినట్లు వివరించారు. భారీ పరిశ్రమలను స్థాపించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సింగిల్ విండో పద్దతి ద్వారా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామని, ఏ పారిశ్రామిక వేత్త ముందుకు వచ్చి రోజుల వ్యవధిలోనే అనుమతులు ఇస్తామని వివరించారు. కొత్తూరు పారిశ్రామిక వాడలో మూతపడిన పరిశ్రమలను పున:రుద్ధరించడమే కాకుండా జాతీయ స్థాయి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.
జెపి దర్గా అభివృద్ధికి రూ.50కోట్లు
ప్రసిద్ధి చెందిన జహంగీర్ దర్గాలో మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా 50కోట్లతో వంద ఎకరాలలో అభివృద్ది చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెల్లడించారు. తెలంగాణలో ప్రత్యేకత కలిగిన ఈదర్గాను దేశంలోనే అభివృద్ది చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని వసతులను సమకూర్చనున్నట్లు తెలిపారు. వంద ఎకరాలలో 50కోట్ల రూపాయల వ్యయంతో మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలు, అనుబంధ గ్రామాలు, గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సమావేశంలో తెలంగాణ డిప్యూటి సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా పసియోద్ధిన్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్, ఎంపీలు జితేందర్‌రెడ్డి, విశే్వశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావులు పాల్గొన్నారు.

చిత్రం..కొత్తూరు మండలం జెపి దర్గాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్