రాష్ట్రీయం

కాపులతో సహా ఏ కులాన్ని బీసీల్లో కలిపినా ప్రతిఘటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: కాపులతో సహా ఏ కులాన్ని బిసిల్లో కలిపినా ప్రతిఘటన తప్పదని పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం విద్యానగర్‌లోని బిసి భవన్‌లో జరిగిన బిసి సంక్షేమ సంఘం జాతీయ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆర్. కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మల్లాది కృష్ణారావు ప్రసంగిస్తూ పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశపెట్టి బిసిలకు చట్ట సభలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని బిసిలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా కాపులను, జూట్లను, గుజ్జర్లను ఇంకా ఏ ఇతర కులానికి చెందిన వారినైనా బిసి జాబితాలో కలిపితే ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ త్వరలో అన్ని రాష్ట్రాల్లో బిసి బహిరంగ సభలు నిర్వహించి, ఢిల్లీలో రణభేరి నిర్విహించి బిసి సత్తా చాటుతామని చెప్పారు.