రాష్ట్రీయం

మాది ప్రజా మేనిఫెస్టో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, నవంబర్ 11: ప్రజల కోసం, ప్రజలు మెచ్చిన, ప్రజల ఆలోచనలతో రూపొందించిన ప్రజా మేనిఫెస్టో తీసుకొస్తామని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఒక రోజు విరామం తరువాత ప్రజా సంకల్పయాత్ర కడప జిల్లా యర్రగుంట్ల నుంచి శనివారం ప్రారంభమైంది. యాత్ర సాయత్రం ప్రొద్దుటూరుకు చేరుకున్న సందర్భంగా స్థానిక పుట్టపర్తి సర్కిల్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ తమ మేనిఫెస్టో మిగతా పార్టీల మేనిఫెస్టోల కన్నా భిన్నంగా ఉంటుందన్నారు. కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఎన్నికలకు ముందే ప్రకటిస్తామన్నారు. అందులో పొందుపర్చిన ప్రతి హామీ తూచతప్పకుండా అమలు చేస్తామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే తాను ఈ ప్రజా సంకల్పయాత్ర చేపట్టినట్టు జగన్ తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలు అందించే సలహాలు, సూచనలు స్వీకరిస్తామని, అవసరమైతే వాటిని మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. రాష్ట్ర పాలన అధ్వాన్నంగా తయారైందని జగన్ బాబుపై ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుచేయలేదన్నారు. టీడీపీ మేనిఫెస్టో గురించి నెట్‌లో ఎంత వెతికినా కానరావడం లేదన్నారు. ఎందుకంటే అమలుకాని హామీలతో కూడిన మేనిఫెస్టో కనిపిస్తే ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో టీడీపీ వారు దాన్ని మాయం చేశారని ఏద్దేవా చేశారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయలేదన్నారు. ఫ్యాక్టరీలు తెస్తామన్నారు, ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని పెద్దపెద్ద వాగ్ధానాలు చేశారు, కానీ మూడున్నరేళ్లు గడిచినా ఏ ఒక్కటీ చేయలేదని ఆరోపించారు. రుణమాఫీ పేర రైతులను, డ్వాక్రా రుణమాఫీ పేర మహిళలను మోసగించిన బాబు ఫీజు రీ యింబర్స్‌మెంట్ పేర విద్యార్థులను సైతం మోసగిస్తున్నారన్నారు. తాజాగా నిరుద్యోగభృతి పేర యువతను మోసం చేస్తున్నారన్నారు. అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించిన బాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే అన్నీ మరచిపోయారని ధ్వజమెత్తారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలనే కోరిక తమకు ఎంతమాత్రం లేదని జగన్ అన్నారు. అందుకే అమలుకు సాధ్యమయ్యే నవరత్నాలను ఇప్పటికే ప్రకటించామన్నారు. అవసరమైతే వీటిలో మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే నవరత్నాలను అమలుచేస్తామన్నారు. అవన్నీ అమలుచేసిన తరువాతే మరోసారి 2024 ఎన్నికల సమయంలో తిరిగి గర్వంగా మీ వద్దకు ఓట్ల కోసం వస్తానని తెలిపారు.
5వ రోజు పాదయాత్ర....
ప్రజా సంకల్పయాత్ర 5వ రోజు యర్రగుంట్ల శివారు నుంచి శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైంది. పోట్లదుర్తి మీదుగా పాదయాత్ర ప్రొద్దుటూరు పట్టణంలోకి ప్రవేశించింది. పట్టణంలోని అమ్మవారిశాలలో పూజలు చేసిన జగన్ పుట్టపర్తి సర్కిల్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. పట్టణంలో అడుగడుగునా జగన్‌కు జనాలు బ్రహ్మరథం పట్టారు. అమ్మవారిశాల నుంచి బంగారు అంగళ్లవీధి వరకు రోడ్డుపై పూలు పరిచి అభిమానులు జగన్‌కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, జిల్లా వైసిపి అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ప్రొద్దుటూరు వైసిపి నాయకులు మురళీధర్‌రెడ్డి, సానపురెడ్డి ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్