రాష్ట్రీయం

దరఖాస్తులు.. పీఛేముడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 11: రాష్ట్రంలో భూసమస్యలతో పాటు రికార్డుల్లోని తప్పులను సరిచేసేందుకు చేపట్టిన మీ ఇంటికి మీ భూమి దరఖాస్తులు అధిక సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి. కోర్టు కేసులు, కొంతమంది రెవెన్యూ సిబ్బంది వైఖరి తదితర కారణాలతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి తిరస్కరణకు గురైన దరఖాస్తుల సంఖ్య దాదాపు 1.29 లక్షలు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ రికార్డుల్లో నమోదైన వివరాల్లో తప్పులను సరిచేసేందుకు 2015లో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దీనివల్ల రెవెన్యూ రికార్డుల్లో ఏవిధంగా ఆయా భూ యజమానుల వివరాలు, విస్తీర్ణం, సర్వే నెంబరు తదితర వివరాలు నమోదు చేశారో తెలుసుకునే వీలు కలిగింది. భూముల వివరాలకు సంబంధించి ఏయే రికార్డులు ఉంటాయి, ఏవిధంగా వివరాలు నమోదు చేస్తారన్న అంశం చాలామందికి తెలియదు. ప్రభుత్వం చేపట్టిన రికార్డుల డిజిటలైజేషన్ కార్యక్రమం, మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం వల్ల రికార్డుల్లోని తమ భూముల వివరాలు తెలుసుకునే వీలు కలుగుతోంది. రెవెన్యూ రికార్డుల్లో చోటుచేసుకున్న తప్పులను సరిచేసేందుకు వీలుగా ఇప్పటి వరకూ మూడుసార్లు మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకూ నిర్వహించిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాల్లో 13.7 లక్షల దరఖాస్తులు అందగా, వాటిలో 1.29 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 9 శాతం మేర తిరస్కరించడం
ఆందోళన కలిగించే అంశం. తిరస్కరణకు గురవడానికి కారణాలను విశే్లషిస్తే కోర్టు కేసుల్లో భూమి చిక్కుకున్న కేసులే ఎక్కువ. చాలాకాలంగా భూమిని సాగు చేస్తున్నప్పటికీ, వాస్తవంలో ఆ భూమి దేవాదాయ శాఖ లేదా ఇతర శాఖలకు చెందినదిగా రికార్డుల్లో ఉండటంతో కూడా ఆ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. దరఖాస్తుతో పాటు అందచేసిన వివరాలకు, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాలకు పొంతన లేకపోవడంతో కూడా దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతున్నాయి. దీనికితోడు సిబ్బంది పని ఒత్తిడి, కొన్ని సందర్భాల్లో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కూడా దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు. కేవలం ఆధార్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్ లేదన్న చిన్న కారణాలతో కూడా దరఖాస్తులను తిరస్కరించడం కూడా కొన్నిచోట్ల జరుగుతోంది. సర్వే నెంబర్లలో లోపాలు, విస్తీర్ణంలో తేడా ఉంటే కూడా తిరస్కరిస్తున్నారు. కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం వల్ల కూడా రికార్డుల్లో తప్పులు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్న భూయజమానులకు రెవెన్యూ సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. రికార్డుల్లో మార్పులు చేసే అధికారం జాయింట్ కలెక్టర్లకు ఇవ్వడం ద్వారా కొంతమేర అక్రమాలకు తెరదించినప్పటికీ, అన్నీ సక్రమంగా ఉన్నా, రికార్డుల్లో మార్పులు చేయడంతో జాప్యం జరుగుతోంది. భారీ సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతున్న నేపథ్యంలో ప్రత్యేక భూ అదాలత్‌లను నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఒక డ్రైవ్ మాదిరిగా చేపట్టడంవల్ల ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.