రాష్ట్రీయం

పార్టీవైపూ పయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాణలో ఇప్పుడున్న పాలక, ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలని టి.జేఏసీపై వత్తిడి పెరుగుతున్నది. ఈ విషయాన్ని స్వయాన టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ వెల్లడించారు. ప్రొఫెసర్ కోదండరామ్ అధ్వర్యంలో శనివారం జేఏసీ కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. సమావేశానంతరం ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని జేఏసీ నేతల నుంచే కాకుండా ప్రజల నుంచీ వత్తిడి వస్తున్నదన్నారు. తాము కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు. రాజకీయాలు అంత నీచమైనవి కావని, వారిలా తాము దొంగ దారిన వెళ్ళి సంపాదించమని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా తమకు ఉద్యోగాలు రావడం లేదన్న బాధతో యువకులు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో క్యాలెండర్ ప్రకటించాలని తాము చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నామని గుర్తు చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. టిఆర్‌టి నోటిఫికేషన్లు గందరగోళంగా ఉన్నాయన్నారు. స్థానిక సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం బాగుపడటానికి రాష్ట్రం చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వ నిరంకుశ విధానం వల్ల సభను జరుపుకోలేకపోయామన్నారు. కొలువుల కొట్లాట సభ నిర్వహించుకోవడానికి కోర్టు అనుమతి ఇవ్వడం తమ విజయంకాదని, నిరుద్యోగుల విజయమని అన్నారు. సరూర్‌నగర్ మైదానంలో సభ పెట్టుకోవాలని సూచించారని, తాము పోలీసులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ నెల 30, వచ్చే నెల 9, 10 తేదీల్లో నల్లగొండలో అమరుల స్పూర్తి యాత్ర కొనసాగించనున్నట్లు ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. గురుకుల టీచర్ల సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్‌వీకేలో రౌండ్ టేబుల్
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ట్రైనింగ్ అసోసియేషన్ శనివారం ఎస్‌వికెలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని విమర్శించారు. వికలాంగుల కోసం దేశంలో సౌకర్యం లేదని, ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రొఫెసర్ కోదండరామ్ ప్రసంగిస్తూ దివ్యాంగుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు. పరిస్థితులకు తగిన విధంగా ఆందోళనలు నిర్వహించాలని ఆయన సూచించారు.