రాష్ట్రీయం

మాజీ ఎమ్మెల్యే దేశిని కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం హైదరాబాద్‌లో మృతి చెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇందుర్తి నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి చినమల్లయ్య క్రియాశీల పాత్ర పోషించారన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సిఎం, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. చినమల్లయ్య మృతిపట్ల సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గీతకార్మిక కుటుంబంలో పుట్టి స్వయంగా వృత్తిని ఆచరించి అంచెలంచెలుగా ఎదిగి, అనంతరం సిపిఐలో చేరి పేద, బడుగు, బలహీన వర్గాలవారికి అండగా పోరాటాలు చేశారని చాడ గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యునిగా ఆయన పని చేశారని తెలిపారు. చినమల్లయ్య మరణం పట్ల సిపిఐ నేతలు పల్లా వెంకటరెడ్డి, మల్లేపల్లి ఆదిరెడ్డి, ఈర్ల నరసింహ, సిపిఐ సీనియర్ నాయకులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.