రాష్ట్రీయం

ఫార్మాకు ప్రజా ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: హైదరాబాద్ ఫార్మా సిటీకి పర్యావరణ అనుమతులకు ఉన్న అవరోధాలు తొలగిపోతున్నాయి. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన ఫార్మాసిటీకి సంబంధించి నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రజాభిప్రాయం అనుకూలంగా వచ్చినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. బహిరంగ విచారణలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది సమర్ధించారు. దీంతో పర్యావరణ అనుమతులు త్వరలోనే కేంద్రం మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు వచ్చాయి. బహిరంగ విచారణలో 32మంది ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించగా, 24 మంది ఫార్మాసిటీకి మద్దతు పలికారు. పర్యావరణ పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అంతర్జాతీయ నిపుణుల సలహాతో అధ్యయనం చేయించి ఉన్నత ప్రమాణాలతో పర్యావరణసహిత వ్యవస్ధను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఫార్మాసిటీని తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) అభివృద్ధి చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో కందకూర్, యాచారం, కడ్తాల్ మండలాల్లో 19,331.2 ఎకరాల్లో ఫార్మాసిటీని నెలకొల్పనున్నారు. దాదాపు
రూ.64 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ ఫార్మా రంగంలో అగ్రగామిగా నిలబెట్టనున్న ఫార్మాసిటీ వల్ల ప్రత్యక్షంగా 1.7 లక్షల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 4.2 లక్షల మందికి ఉపాధి లభించనుంది. భూసేకరణకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకుంటూ ఫార్మాసిటీని వీలైనంత త్వరగా నెలకొల్పాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. మొదటి దశలో 8900 ఎకరాల భూసేకరణ చేపట్టాలని నిర్ణయించగా, ఇంతవరకు 6900 ఎకరాలను సేకరించారు. మిగతా భూముల సేకరణ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్యరహిత ఫార్మాసిటీ లక్ష్యంగా ప్రభుత్వం పనులను చేపట్టింది. ఇప్పటికే వాతావరణ, జల కాలుష్యం ప్రభావంపై అధ్యయనం చరిగింది. రాష్ట్రప్రభుత్వానికి చెందిన నిపుణులు ఇప్పటికే ఐరోపా, అమెరికా, చైనా, సింగపూర్ దేశాల్లో పర్యటించి ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను పరిశీలించి నివేదికను ఇచ్చారు. జీలో లిక్విడ్ డిశ్చార్జ్ (జడ్‌ఎల్‌డి) వ్యవస్ధను ఇక్కడ ఏర్పాటుచేయనున్నారు. కాలుష్య జలాలను ఉమ్మడి శుద్ధి ప్లాంట్లద్వారా శుభ్రం చేస్తారు. దీని కెపాసిటీ 66 ఎంఎల్‌డి. మొదటి దశలో 24ఎంఎల్‌డి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు ఎనిమిది సంస్ధలు ఆసక్తిని కనపరుస్తున్నాయి. ఫార్మాసిటీ ఏర్పాటైన తర్వాత దాదాపు సాలీనా రూ.58వేల కోట్ల ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వివిధ ప్రదేశాల్లో ఉన్న 300కుపైగా ఫార్మా కంపెనీలకు ఫార్మాసిటీలో స్ధలం కేటాయిస్తారు. ఈ ప్రాజెక్టుకు రూ.1500 కోట్లను ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఫార్మాసిటీలో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, ఫార్మా కంపెనీల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తారు. ఫిజర్, జాన్సన్ అండ్ జాన్సన్, డాక్టర్ రెడ్డీల్యాబ్స్, జైడస్ కాడియా, మైలాన్, అరబిందో లాంటి ఫార్మాదిగ్గజ కంపెనీలు ఫార్మాసిటీలో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. కొన్ని కంపెనీలు పది ఎకరాలు, మరి కొన్ని కంపెనీలు 200 ఎకరాల వరకు స్ధలం కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేశాయి. చిన్న, మధ్య తరహా కంపెనీలు 10 నుంచి 50 ఎకరాలు కేటాయించాలని కోరుతున్నాయి. ఫార్మాసిటీలో 33 శాతం స్ధలాన్ని గ్రీన్ బెల్ట్‌గా తీర్చదిద్దనున్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో లైట్ రైల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. షాద్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి 48 కి.మీ పొడువు రైలు మార్గాన్ని ఫార్మాసిటీతో అనుసంధానం చేయనున్నారు.