రాష్ట్రీయం

ఉద్యోగాల నోటిఫికేషన్లపై 4 నెలల్లోగా నిర్ణయం తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలు 2011, 2012 సంవత్సరాల్లో సబ్ ఇంజనీర్లు, లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్లలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చే నాలుగు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు శనివారం ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ చల్లా కోదండరామ్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. గతంలో 2014లో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పునసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించి పై నిర్ణయాన్ని వెలువరించింది. సర్వీసులో ఉన్న అభ్యర్ధులకు 45 మార్కులను కేటాయిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విద్యుత్ సంస్ధలు నోటిఫికేషన్ ఇచ్చాయి. కొంత మంది అభ్యర్ధులు సర్వీసులో ఉన్న అభ్యర్థులకు 45 మార్కులను కేటాయించడాన్నిసవాలు చేశారు. సింగిల్ జడ్జి తీర్పు ఇస్తూ 45 మార్కులను 20మార్కులకు తగ్గించారు. కొంత మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఈ తీర్పును సవాలు చేశారు. డివిజన్ బెంచి సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పు సబబే అంటూ తీర్పు ఇచ్చి తాజాగా పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.