రాష్ట్రీయం

ముప్పేటగా మూడేళ్ల నందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: మూడేళ్లుగా పెండింగ్‌లోవున్న నంది, జాతీయ స్మారక అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2014, 2015 చలనచిత్ర నంది అవార్డులు, ఎన్టీఆర్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి -చక్రపాణి జాతీయ అవార్డులనూ ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో సిఎం చంద్రబాబుకు జ్యూరీ సభ్యులు అవార్డు విజేతల వివరాలు అందించారు. 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించి అవార్డుల ఎంపికలను సినీ ప్రముఖులు గిరిబాబు, జీవిత, పోకూరి బాబూరావు నేతృత్వంలోని జ్యూరీలు నిర్వహించాయి. 2015కి సంబంధించి బాహుబలికి ఎక్కువ అవార్డులు దక్కడం విశేషం. వివరాలను సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ మురళీమోహన్, ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ, సినీనటులు ఊహ, ప్రభ, కళ్లు రఘు, ఎఫ్‌డీసీ ఎండీ వెంకటేశ్వర్ తదితరులు మీడియాకు వెల్లడించారు. బిఎన్ రెడ్డి జాతీయ ఫిల్మ్ అవార్డు 2014కు సంబంధించి దర్శకుడు రాజవౌళి, 15కు సంబంధించి త్రివిక్రమ్ శ్రీనివాస్, 16కు సంబంధించి బోయపాటి శ్రీనుకు ప్రకటించారు. రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును 2014లో కృష్ణంరాజు, 15లో పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్, 2016లో చిరంజీవికి ప్రకటించారు. నాగిరెడ్డి -చక్రపాణి జాతీయ ఫిల్మ్ అవార్డును 2014లో నారాయణమూర్తి, 15లో కీరవాణి, 16లో కెఎస్ రామారావుకు ప్రకటించారు. ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డును 2014లో కమల్‌హాసన్‌కు, 15లో కె రాఘవేంద్రరావు, 16లో రజనీకాంత్‌కు ప్రకటించారు.
2014 నంది అవార్డులు
ఉత్తమ చిత్రంగా లెజెండ్, ఉత్తమ ద్వితీయ చిత్రంగా మనం, తృతీయ చిత్రంగా హితుడును ప్రకటించారు. ఉత్తమ నటుడిగా
బాలకృష్ణ (లెజెండ్), దర్శకుడిగా బోయపాటి (లెజెండ్), ఉత్తమ హీరోయిన్‌గా అంజలి (గీతాంజలి), ఉత్తమ విలన్‌గా జగపతిబాబు (లెజెండ్) ఎంపికయ్యారు.
2015 నంది అవార్డులు
ఉత్తమ చిత్రంగా బాహుబలి (ది బిగినింగ్), ద్వితీయ చిత్రంగా ఎవడే సుబ్రహ్మణ్యం, తృతీయ చిత్రంగా నేను శైలజకు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా మహేష్‌బాబు (శ్రీమంతుడు), దర్శకుడిగా ఎస్‌ఎస్ రాజవౌళి (బాహుబలి), ఉత్తమ నటిగా అనుష్క (రుద్రమదేవి), ఉత్తమ విలన్‌గా రాణా (బాహుబలి), ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి (బాహుబలి)ని ఎంపిక చేశారు.
2016 నంది అవార్డులు
ఉత్తమ చిత్రంలో పెళ్లి చూపులు, ఉత్తమ ద్వితీయ చిత్రంగా అర్థనారి, ఉత్తమ తృతీయ చిత్రంగా మనలో ఒకడు ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్, ఉత్తమ దర్శకుడిగా సతీష్ వేగెశ్మ, ఉత్తమ నటిగా రీతూ వర్మను ప్రకటించారు.