రాష్ట్రీయం

పోలవరంపై త్వరలో కీలక భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: పోలవరం ప్రాజెక్టు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కారాన్ని కనుగొనేందుకు వారంలో కేంద్ర, రాష్ట్ర సీనియర్ అధికారులతో కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుగుదేశం సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. బుధవారం నితిన్ గడ్కరీతో చర్చలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు, పునరావాస నిధులు, కాంట్రాక్టర్‌ను మార్చటం, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చెల్లించవలసిన నిధుల గురించి నితిన్ గడ్కరీతో ప్రధానంగా చర్చించినట్లు సుజనా చౌదరి వెల్లడించారు. ప్రాజెక్టు కాంట్రాకర్‌ను మార్చే ప్రసక్తే లేదని గడ్కరీ ఇంతకుముందే స్పష్టం చేయటం తెలిసిందే. బుధవారం సుజనా చౌదరి వాదన విన్న తరువాత మరోసారి సిఎంతో దీని గురించి చర్చించి నిర్ణయం తీసుకునేందుకు నితిన్ గడ్కరీ అంగీకరించారని మంత్రి సుజన చెప్పారు.