రాష్ట్రీయం

డీడీల ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యేకు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ అనంతపురం, నవంబర్ 15: నకిలీ డీడీల కేసులో అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్‌కు ఐదేళ్ల జైలుశిక్ష పడిం ది. పదేళ్లపాటు విచారణ అనంతరం బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. 2003లో ఎస్‌బీఐ నకిలీ డీడీల కుంభకోణం వెలుగు చూసింది. కదిరి ఎస్‌బీఐ మేనేజర్ నరసింహరావుతో కుమ్మక్కై లక్షలాది రూపాయలు అక్రమంగా డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అప్పటి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ నరసింహారావు, ఇన్‌స్పెక్టర్ మోహన్ నిందితులుగా ఉన్నారు. కేసును వేగవంతం చేయడంలో భాగంగా 2007లో సిబిఐకి అప్పగించారు. నాంపల్లిలోని సిబిఐ కోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపి కేసు పూర్వాపరాలను విచారించింది. బెంగళూరులో నకిలీ డీడీలు తయారుచేసి వాటిని బ్యాంకులో అక్రమంగా మార్చుకున్నట్లు రుజువైంది. దీంతో కేసులో ప్రధాన నిందితులైన మాజీ ఎమ్మెల్యేతోపాటు నకిలీ డీడీల అక్రమాలకు సహకరించిన ఎస్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్ నర్సింగరావుకు కూడా ఐదేళ్ల జైలు, ఇన్స్‌పెక్టర్ వెంకటమోహన్‌కు మూడేళ్ల జైలు శిక్షతోపాటు వీరికి రూ.5.10 లక్షల జరిమానా కూడా విధిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. హైదరాబాద్ హుస్సేని ఆలం ఎస్‌బీఐలో నకిలీ డీడీలతో మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా కందికుంట వెంకటప్రసాద్ గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు నకిలీ డీడీల కుంభకోణం కేసులో కూడా ఏడేళ్ల శిక్ష అనుభవించారు.