రాష్ట్రీయం

రీయంబర్స్‌మెంట్‌పై దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలోని విద్యార్థులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడ చదువుకున్నా ఫీజు రీయంబర్స్‌మెంట్ చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై దుమారం చెలరేగింది. ఈ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందని విపక్షాలు మండిపడ్డాయి. అయితే ఈ పథకాన్ని పగడ్బందిగా అమలు చేస్తున్నామని, విద్యార్థులు ఆంధ్రలో చదువుకున్నా రీయంబర్స్‌మెంట్ చేస్తామని ఆయన తెలిపారు. గత ఏడాది ఫీజులే చెల్లించలేదని, 14 లక్షల మంది విద్యార్థులు, 4 లక్షల మంది అధ్యాపకులు, సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని విపక్షాలు విరుచుకుపడ్డాయి. మంత్రి ఈటల సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్షాల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
బుధవారం అసెంబ్లీలో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై స్వల్ప వ్యవధి ప్రశ్న కింద సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల సభ్యులు లేవదీసిన అనేక ప్రశ్నలకు, సందేహాలకు మంత్రి ఈటల సమాధానమిస్తూ రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని పగడ్బందిగా అమలు చేస్తున్నామని అన్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించామని ఆయన చెప్పారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయకపోవడంతోనే కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని విపక్షాలు చేసిన విమర్శలు ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. సంఖ్య తగ్గడానికి ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో సంబంధం లేదని ఆయన తెలిపారు. 2016-17 విద్యా సంవత్సరంలో రూ.3,200 కోట్ల బకాయిలు ఉంటే రూ.2,896 కోట్లు చెల్లించామన్నారు. అడ్మిషన్ల ప్రక్రియలో తేడాల కారణంగా ఏ ఏడాదికి ఆ ఏడాది ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయడం సాధ్యం కాదని ఆయన వివరించారు. ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకు అత్యధికంగా మెస్ ఛార్జీలు పెంచామని ఆయన గుర్తు చేశారు. కళాశాల అనుబంధ వసతి గృహ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను రూ.900 నుంచి రూ.1500లకు పెంచామని, ఇంటర్ విద్యార్థులకు రూ.520 నుంచి రూ.750కి పెంచామని ఆయన వివరించారు. అదేవిధం ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థులకే కాకుండా అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. వసతి గృహాల విద్యార్థులకు సన్న బియ్య ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా ఇది లేదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని మంత్రి ఈటల చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ భోళాశంకరుడని, ఎవ్వరు ఏదీ కోరితే అది ఇచ్చేస్తారని మీరే అన్నారని మంత్రి ఈటల కాంగ్రెస్ సభ్యులనుద్ధేశించి అన్నారు.

హరీష్-ఉత్తమ్ మాటల యుద్ధం
ఇలాఉండగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీశ్‌రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై మంత్రి ఈటల సమాధానం సంతృప్తిగా లేనందుకు తాము నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేస్తామని ఉత్తమ్ అన్నారు. అందుకు మంత్రి హరీష్‌రావు అభ్యంతరం చెప్పారు. వాకౌట్ గురించి శాసనసభాపక్షం నాయకుడు చెప్పాలని, ఒకవేళ ఆయన లేకపోతే ఉప నాయకుడైనా చెప్పాలని, ఇదే సంప్రదాయమని హరీష్‌రావు అన్నారు. దీంతో ఉత్తమ్ తీవ్ర స్వరంలో మంత్రికి సభ నియమాలపై అవగాహన లేదని విమర్శించారు. సభ్యుడు ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. మంత్రి హరీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యులకు సభా సంప్రదాయాలపై గౌరవం లేదని, ఉప నాయకుడిపై విశ్వాసం లేదా లేక అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయా? అనేది వారి ఇష్టమని అన్నారు. తనకు అవగాహన లేదనడం ఉత్తమ్ విజ్ఞతకే వదిలి వేస్తున్నానని హరీశ్ రావు తెలిపారు.