రాష్ట్రీయం

ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 15: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం వాయుగుండంగా మారింది. ఇది విశాఖకు దక్షిణంగా 170 కిలో మీటర్ల దూరంలో, దక్షిణ ఒడిశా తీరాన్ని ఆనుకుని ఈశాన్య దిశగా కదులుతున్నట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలియచేశారు. ఈ వాయుగుండం మరో 24 గంటల తరువాత క్రమేపీ బలహీనపడనుంది. దీని ప్రభావం వలన ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో చెదురు, మదురు వర్షాలు కురియనున్నాయి. ఉత్తర కోస్తా తీరం వెంబండి గంటకు 50 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. దక్షిణ కోస్తాలో 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటవ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.