రాష్ట్రీయం

కళ్లారా.. తనివితీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 16: కృష్ణాడెల్టాకు జీవం పోసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం, రాష్ట్రానికి జీవనాడి కానున్న పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రజాప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబును అపర భగీరథుడంటూ ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ప్రతిఒక్కరూ కళ్లారా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో గురువారం 60మంది ఎమ్మెల్యేలు, 15మంది ఎమ్మెల్సీలు, ఆరుగురు మంత్రులు, ఒక ఎంపితో కూడిన బృందం అమరావతి నుంచి వచ్చారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో పంపింగ్ హౌస్, డెలివరీ పాయింట్లను, పోలవరం పనులను, స్పిల్‌వే పనులను పరిశీలించారు. ఇంజనీర్లు, ఇతర అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
వంద టిఎంసిల గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తరలించామని, ఫలితంగా అక్కడ వేలకోట్ల రూపాయల విలువైన పంటలను సాధించగలిగామని వివరించారు. కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి అక్కడ కూడా పరిస్థితులు
సాగుకు అనువుగా మార్చామని వివరించారు. వీటిపై ప్రజాప్రతినిధులు వ్యక్తపరచిన సందేహాలను మంత్రి దేవినేని ఉమ నివృత్తి చేశారు.
మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, తొలిదశలో ఎన్నో సందేహాలు వ్యక్తం చేసి రైతాంగంలో ఆందోళన నింపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ ప్రాజెక్టులను ప్రత్యక్షంగా పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి సంకల్పించిన విధంగా గ్రావిటీ ద్వారా కాల్వలకు నీరు విడుదల చేయటం ఖాయమని చెప్పుకొచ్చారు. ఇది వరకు ఎన్నడూ చూడని ప్రాజెక్టు పనులను, జలాల తరలింపును చూసి తామంతా ఉబ్బితబ్బిబ్బయ్యామని, ప్రాజెక్టు పూర్తయ్యాక రాష్ట్రం కరువురహితంగా మారటం తథ్యమని పలువురు పేర్కొన్నారు.
రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, పట్టిసీమ నుంచి వంద టిఎంసిల జలాలను కృష్ణాడెల్టాకు తరలించటం ద్వారా వేల కోట్ల రూపాయల పంటను సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. కేవలం 5టిఎంసిల నీటికోసం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని, అలాంటిది పట్టిసీమ వంటి ప్రాజెక్టు ద్వారా వంద టిఎంసిలను అవసరమైన ప్రాంతానికి తరలించి వ్యవసాయాన్ని కాపాడిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతం నీరులేక కరువుసీమగా మారుతుంటే పట్టిసీమ నుంచి వచ్చిన జలాలను కృష్ణా డెల్టాలో వినియోగించి ఆమేరకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో అందుబాటులోకి వచ్చిన జలాలను రాయలసీమకు, కుప్పం వరకు కూడా తరలించటం ద్వారా అక్కడ సాగుకు అనుకూలమైన పరిస్ధితులను సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ సమర్ధత వల్లే రాష్ట్రానికి కియామోటార్స్ సంస్ధ వచ్చిందని, ఏడాది క్రితం వారు వచ్చి ప్లాంట్ ఏర్పాటుచేసే ప్రాంతాన్ని చూసుకుని జలాలు ఎలా అందుబాటులోకి వస్తాయని ప్రశ్నించారని, ఆయితే ఏడాదిలోగా అక్కడకు జలాలు తీసుకువచ్చే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఆ ప్రకారమే ఏడాది తర్వాత కియామోటార్స్ ప్రతినిధులు వచ్చి అక్కడకు జలాలు అందుబాటులోకి రావడం చూసి ఆశ్చర్యపోయి వెంటనే ప్లాంట్ ఏర్పాటుచేసేందుకు సిద్ధపడ్డారని చెప్పారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ, పట్టిసీమ నిర్మాణం ద్వారా కృష్ణా డెల్టాను కాపాడారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రులు పితాని సత్యనారాయణ, పరిటాల సునీత, కెఎస్ జవహర్, మాజీ మంత్రి డాక్టరు పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, మండలి చీఫ్ విప్ షరీఫ్, బిజెపి పక్షనేత విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
తొలుత గోదావరి జిల్లాల అతిధ్యాన్ని ప్రజాప్రతినిధులు స్వీకరించారు. ప్రత్యేక ఆకర్షణగా మామా అల్లుళ్లు
ఈ పర్యటన మొత్తంలో మామా అల్లుళ్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇరువురూ ప్రాజెక్టు ప్రాంతంలో కలియతిరుగుతూ అన్ని అంశాలను అడిగి తెలుసుకున్నారు. పట్టిసం ఎత్తిపోతల వద్ద మంత్రి లోకేష్ మామ బాలకృష్ణతో కలిసి సెల్ఫీలు దిగారు.
*
చిత్రాలు..పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద జీవ జలాలకు పుష్పాభిషేకం చేస్తున్న
మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇతర ప్రజాప్రతినిధులు,
*అనంతరం ముగ్గురు నేతల సెల్ఫీ