రాష్ట్రీయం

మరో విషయం లేదా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: ‘ఎప్పడు అప్పులు...్ఫజు రియింబర్స్‌మెంట్ ఇవ్వేనా సమస్యలు, ఇంకే సబ్‌జెక్ట్ లేదా? వినీవినీ మరీ రోటీన్‌గా అనిపించడం లేదా? కొత్త విషయాలుంటే చెప్పకూడదా?’ అని విపక్షాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సుతిమెత్తగా మందలించారు. ‘బంగారు తెలంగాణ అంటే రాత్రికి రాత్రి బంగారు తెలంగాణగా మారుస్తామని కాదు, ఆ దిశగా అడుగులు వేస్తామని అర్థం’ అన్నారు. బంగారు తెలంగాణ అంటే ఏమిటనీ మన సొంత రాష్ట్రాన్ని మనమే తక్కువ చేసుకునేలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. శాసనసభలో గురువారం గురుకుల పాఠశాలలు, కళాశాలలపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ‘మేము అట్టర్ ప్లాప్
అయ్యామని సభా సాక్షిగా కోమటిరెడ్డి ఒప్పుకున్నారు’ అని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. ‘హాస్టళ్లలో ఫ్యాన్లు లేవు, మంచాలులేవు, బాత్‌రూమ్‌లు లేవంటున్నారు, మీ హయాంలో మీరేమైనా బంగారు మంచాలు వేస్తే మేము వచ్చాక తీసేసామా?, చెడగొట్టామా?’ అని ముఖ్యమంత్రి నిలదీసారు. సమస్యలు ఉంటాయి, ఉండవని చెప్పడం లేదు, వాటిని ఒక్కోక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం’ అన్నారు. ‘ఇప్పటికే అనేకసార్లు చెప్పాం, మేము అధికారంలోకి వచ్చి 40 నెలలే అయింది, ఇంకా మాకు 20 నెలల గడువు ఉంది, అప్పటికీ పరిష్కారం కాకపోతే విమర్శించారంటే అర్థం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు. హాస్టళ్లు, గురుకుల పాఠశాలల గురించి అంత తేలికగా, చులకనగా మాట్లాడటం వల్ల వీటిలో చదువుకునే పేద విద్యార్థులతో పాటు అక్కడ కష్టపడి పని చేస్తున్న ఉద్యోగులు, అధికారుల మనస్థైర్యం దెబ్బతింటుందని ముఖ్యమంత్రి హితవు పలికారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలపై 2025 నాటికి రూ.8700 కోట్లు ఖర్చు పెట్టే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టు ముఖ్యమంత్రి వివరించారు. ప్రతీ మండలంలో రెండు, మూడు గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం, నీతి అయోగ్ కూడా గురుకుల విద్యాలయాలను ప్రోత్సహించమని సిఫారసు చేసిందని ముఖ్యమంత్రి గుర్తు చేసారు.