రాష్ట్రీయం

టీఆర్‌ఎస్ నేత దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: హైదరాబాద్‌లో ఓ టిఆర్‌ఎస్ నేత హత్యకు గురయ్యాడు. వల్లభనేని శ్రీనివాసరావు అనే నాయకుడు సనత్‌నగర్ బస్టాండ్ సమీపంలో హత్యకు గురై ఉండడాన్ని గురువారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు టిఆర్‌ఎస్ నేత శ్రీనివాసరావును బుధవారం అర్ధరాత్రి దాటాక తలపై బండరాళ్లతో మోది హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సంఘటనాస్థలంలో రెండు మద్యం బాటిళ్లతోపాటు నాలుగు గ్లాసులు ఉండడంతో నలుగురు కలసి మద్య సేవించిన అనంతరం మిగతా ముగ్గురు కలిసి శ్రీనివాసరావును హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలకొల్లుకు చెందిన శ్రీనివాసరావు గత కొనే్నళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో కొనసాగుతుండగా, ఆ పార్టీలోని మరో వర్గం అతణ్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే శ్రీనివాసరావు హత్యకు గురవ్వడంతో ప్రత్యర్థి వర్గమే ఇతణ్ని హత్య చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. డాగ్ స్క్వాడ్‌ను, ప్రత్యేక పోలీస్ బృందాన్ని రంగంలోకి దింపి నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.

చిత్రం..హత్యకు గురైన వల్లభనేని శ్రీనివాసరావు