రాష్ట్రీయం

సీట్ల లెక్క పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: ‘లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచండి..’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ‘రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు -కొత్తగా పాలన వ్యవస్థ’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రశ్నలు, సందేహాలకు సిఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. పరిపాలనా సంస్కరణలు, సౌలభ్యం కోసమే జిల్లాల సంఖ్య పెంచామన్నారు. సంస్కరణలు ఆరంభం మాత్రమేనని, జిల్లాల, రెవెన్యూ మండలాల సంఖ్య పెంచాలన్న వత్తిడి ఇంకా ఉందన్నారు. సంస్కరణల్లో భాగంగా అసెంబ్లీ సీట్లూ పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరామని, ఈ విషయంలో తాత్సారం జరుగుతోంద న్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలే కాదు లోక్‌సభ సీట్లూ పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో 20 లక్షల మంది ఓటర్లు ఉంటే, ఒక ఎంపీ అందరికీ ఎలా సేవ చేస్తాడని ప్రశ్నించారు. సీట్లు పెంచుకోవడానికి చట్టం ఉందని, కేంద్రం ఆలోచించడం లేదన్నారు.
త్వరలో పంచాయతీ, మున్సిపాలిటీ చట్టం
‘నూతన పంచాయతీ, మున్సిపాలిటీ చట్టం తెద్దాం..’ అని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా, రెవెన్యూ, మండల సంస్కరణలు ముగింపు కాదని, నిరంతరం కొనసాగే ప్రక్రియ అన్నారు. అసెంబ్లీని వాయిదా వేసుకున్నా మళ్లీ త్వరలోనే సమావేశమవుదామని చెప్పారు. ఆఫ్రికాలో ఈ విధానం బాగుందని విన్నాం కాబట్టి ఈలోగా అధికారుల బృందం అధ్యయనం చేసి వస్తుందన్నారు. 5 వేల కొత్త గ్రామ పంచాయతీలు, 15 నుంచి 20 కొత్త మున్సిపాలిటీలు తెద్దామన్నారు. 2019 ఎన్నికలలోగా ఏ జిల్లాకు ఆ జిల్లా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 2024నాటికి పూర్తిగా గాడిలో పడుతుందన్న నమ్మకం ఉందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ఉద్ధేశంతో, ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్ళేందుకు విస్తృతంగా సమాలోచనలు జరిపి కొత్త జిల్లాల ఏర్పాటుకు సమగ్ర కసరత్తు నిర్వహించామని సీఎం వివరించారు. ఈ కసరత్తు ఫలితంగా 21 కొత్త జిల్లాలు, 25 కొత్త డివిజన్లు, 125 కొత్త మండలాలు ఏర్పాటు చేస్తూ గత ఏడాది అక్టోబర్ 11 దసరా రోజున నోటిఫికేషన్ జారీ చేశామని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఇది ఒక అసమానమైన, అపూర్వమైన సంఘటనగా అభివర్ణించారు. అయినా జిల్లాలు, రెవెన్యూ మండలాల ఏర్పాటుకు డిమాండ్ ఉందని చెబుతూ, సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య భద్రాచలం జిల్లా కావాలని కోరడాన్ని ఉదహరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ జిల్లాల పునరుద్ధరణను కేంద్రం ఆమోదించలేదని చెప్పడాన్ని కేసీఆర్ ప్రస్తావిస్తూ ఇది పూర్తిగా రాష్ట్రాలకు ఉండే అధికారమని వివరించారు. ఇందులో కేంద్రానికి జోక్యం చేసుకునే హక్కు లేదన్నారు. కేంద్రం నోటిఫై చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. 2 లక్షల లోపు కుటుంబాలున్న జిల్లాలు 14, మూడు లక్షల లోపు కుటుంబాలున్న జిల్లాలు 10, నాలుగు లక్షలలోపు కుటుంబాలున్న జిల్లాలు 4, ఐదు లక్షలకు పైగా కుటుంబాలున్న జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ అని వివరించారు. తెలంగాణవ్యాప్తంగా 468 డివిజన్లు, 584 మండలాలు, 9 పోలీసు కమిషనరేట్లు, 814 పోలీసు స్టేషన్లు ఉన్నాయన్నారు. కొమురంభీం, భూపాలపల్లి, మహబూబాబాద్, కొత్తగూడెంవంటి మారుమూల, వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు వర్తింపజేస్తూ కొత్త చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల ఇప్పటి వరకూ నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల కేంద్రీకృత, సత్వర అభివృద్ధికి వీలు కల్పించినట్లు వివరించారు. ఆంధ్ర, పశ్చిమబంగ వినా అన్ని రాష్ట్రాలూ జిల్లాల విభజన చేపట్టాయని, పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు అని సీఎం కేసీఆర్ తెలిపారు. జోన్లను తెలంగాణకు అనుకూలంగా మార్చుకుందామన్నారు.