రాష్ట్రీయం

బ్లూ-గ్రీన్ సిటీగా రాజధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: అమరావతి పిల్లలు దేశానికి పెద్ద ఆస్తి అని, వీరికి తోడ్పాటు అందిస్తే ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తారని సీఎం చంద్రబాబు కితాబునిచ్చారు. రాజధాని అమరావతిని 50 శాతం పచ్చదనంతో గ్రీన్, బ్లూ సిటీగా తయారు చేస్తామన్నారు. శనివారం రాజధాని ప్రాంతం మందడం గ్రామ పరిధిలోని డౌన్ ట్రేడన్ యాక్సిస్ రోడ్డువద్ద వనం-మనంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన హోమంలో పాలొని, పలు అభివృద్ధి కార్యక్రమాల చిత్ర ప్రదర్శన తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతిలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనేందుకు 26 సంస్థల నుంచి 5వేల మంది విద్యార్థినీ విద్యార్థులు వచ్చినందుకు అభినందించారు. కార్తీకమాసం చివరి రోజున కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభకరమన్నారు. మనం చేపట్టే కార్యక్రమాలతో అమరావతి బ్లూ-గ్రీన్ సిటీ అవుతుందన్నారు. విశాఖలో నిర్వహించిన ఆగ్రిటెక్ సదస్సుకు హాజరైన బిల్‌గేట్స్‌ను ప్రపంచానికి అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ని ఆంధ్రకూ అందించి సహకరించాలని కోరానన్నారు.
మనిషికి ఆరోగ్యం, ఆహ్లాదం ఇచ్చేది చెట్లేనని, అందుకే అమరావతిలో రోడ్లు వేయకముందే ఇరుపక్కల చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టాలని సూచించానన్నారు. ఈ రోడ్ల వెంట ప్రయాణిస్తుంటే నందనవనంలో విహరించినట్లుగా ఉండాలన్నారు. 330 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు అమరావతి రాజధానిలో నిర్మిస్తున్నామని, 5-10 కిలోమీటర్ల పరిధిలో ఆఫీసులకు సైకిళ్లపై వెళ్లే విధంగా నిర్మిస్తున్నామన్నారు.
దేవతలు యాగం చేసినప్పుడు రాక్షసులు అడ్డుపడేవారని, ఇలాంటి వారు ఎంత మంది అడ్డుకున్నా రాజధానిని నిర్మించి తీరతామన్నారు. భావితరాలకు గుర్తుగా వారు సేదతీరేలా ప్రపంచమంతా ఇక్కడకు వచ్చేలా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు. వారంలో 5రోజులు పనిచేసి 6వ రోజు శనివారం మధ్యాహ్నం నుంచి చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, అలా చెట్లు నాటడం వల్ల పరిశుభ్రమైన గాలి దక్కుతుందన్నారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే పిల్లలకు 5 శాతం మార్కులు కేటాయిస్తున్నామన్నారు.
రాజధానిలోని 9వేల ఎకరాల్లో గ్రీన్ ఏరియా అభివృద్ధి చెందుతుందని, 5,50,000 మొక్కలు రోడ్ల వెంట ఇరువైపులా నాటుతున్నామన్నారు. ఇబ్బందుల నుంచి అవకాశాలను వెతుక్కోవాలని, అలాగే రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నామని, సంక్షోభాన్ని అవకాశంగా
మార్చుకుంటున్నామన్నారు. కొండవీటి వాగును సుందరమైన వాగుగా మార్చుతున్నామన్నారు. ఆంధ్రకు సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్‌గా పేరు పెట్టామని, ఇక్కడ ఎండలు విపరీతంగా ఉంటాయని, దానికి పరిష్కారంగా ఎండను సోలార్ ఎనర్జీగా మార్చుకుంటామన్నారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టంతో ఏరియా అంతటికి కూలింగ్ సిస్టం తెస్తే 30-40 శాతం విద్యుత్ ఖర్చు తగ్గుతుందని, భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచకుండా తగ్గించే ఏర్పాట్లు చేయగలుగుతామన్నారు.
రాజధాని అమరావతిలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తాయన్నారు. అమరావతిని చూడగానే పెద్ద భవంతులతోపాటు పచ్చని చెట్లు కనిపించాలన్నారు. రాజధానిలో 27 శాతం గ్రీన్ కవర్ ఉండేలాగా 3-4 శాతం పండ్ల చెట్లు, 23 శాతం అడవులు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. 2029 నాటికి 50 శాతం చెట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమం ప్రారంభంలో వివిధ కళాశాల, స్కూల్ విద్యార్థినీ విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమం ఆవశ్యకతపై మాట్లాడారు.
మున్సిపల్ వ్యవహారాల మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ సింగపూర్ మాస్టర్ ప్లాన్‌లో 27 శాతం గ్రీన్ కవర్‌కు కేటాయించామన్నారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అమరావతి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషకరమన్నారు. రాజధానికి 14వేల కోట్లతో పనులకు టెండర్లు పిలిచామని, 2018 జనవరి నుంచి పనులు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, పుడ్ కమిషన్ చైర్మన్ జెఆర్ పుష్పరాజ్, ఏడీసీ చైర్మన్ లక్ష్మీపార్థసారధి, సీఆర్‌డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మందడం గ్రామం వద్ద మొక్కలు నాటుతున్న సీఎం చంద్రబాబు