రాష్ట్రీయం

మారిస్తేనే.. మనుగడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 19: ప్రత్యేక హోదా, పోలవరం, ప్రత్యేక ప్యాకేజీ, వైసీపీ దూకుడు వంటి కీలక అంశాలతో పాటు కేంద్రంతో సత్సంబంధాలు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో 60 మందిని మారిస్తే తప్ప, మళ్లీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదని వివిధ సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ సర్వేలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేల చర్యల వల్ల టీడీపీ ప్రతిష్ఠ దిగజారుతున్న సంకేతాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీ వారినే వేధిస్తుండటంతో, ద్వితీయ శ్రేణి నేతల్లో వారిపై తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతోంది. గత ఎన్నికల్లో కొత్తవారైనప్పటికీ పార్టీ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో పాటు, సొంత సామాజిక వర్గం ఈసారి అధికారంలోకి రాకపోతే స్థానికంగా కూడా దెబ్బతింటామన్న ఆందోళన చెందారు. దాంతో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పలుకుబడి ఉన్న నేతలు అభ్యర్థులతో సంబంధం లేకుండా, సొంత డబ్బులు ఖర్చుపెట్టి మరీ అభ్యర్థులను గెలిపించారు. అయితే, గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు వారిని పక్కకుపెట్టి కొత్తవారిని ప్రోత్సహించడం, వచ్చే ఎన్నికల్లో ఆర్థికంగా బలపడేందుకు అప్పటినుంచే అడ్డదారులు తొక్కుతుండటంతో అంతకుముందున్న కీలక నేతలు-ఎమ్మెల్యేల మధ్య దూరం పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆర్థికంగా బలపడాలన్న తొందరలో కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీకి చెందిన నేతల వ్యాపారాలను దెబ్బకొట్టడమో, లేదా ఆ క్రమంలో వారి నుంచి డబ్బులు గుంజడమో చేస్తున్నట్లు నాయకత్వం దృష్టికీ వస్తోంది. మైనింగ్, ఇసుక, వైన్‌షాపులు, బార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా విధానాలు కనిపిస్తున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు జిల్లా మైనింగ్ అధికారులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం కోసం పనిచేసిన నేతల వ్యాపారాల్లో బలవంతంగా వాటాలు తీసుకోవడమో, కొత్త వైన్‌షాపు, బార్లు ఇప్పిస్తే అందులో పెట్టుబడి లేకుండా వాటా తీసుకోవడమో చేయడం గత మూడేళ్లలో కొందరు ఎమ్మెల్యేలకు అలవాటయిందన్న ఫిర్యాదులు ఇప్పటికే అధిష్ఠానం వద్ద వెల్లువెత్తుతున్నాయి.
ఈ తరహా ధోరణి ఎక్కువగా గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల్లో వుందని, గుంటూరు జిల్లాలో అయితే నాలుగైదు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయి. పరుచూరు నియోజకవర్గంలో ఒక మండలాన్ని శాసించే ఓ సీనియర్ నేత ఎన్నికల్లో అధికారంలోకొస్తే తిరుమలకు వెనక్కి నడుచుకుంటూ వస్తానని మొక్కుకుని, పార్టీ గెలిచిన తర్వాత మొక్కు తీర్చుకున్నారు. ఇప్పుడు సదరు నేతకు పోటీగా వైసీపీ నుంచి వచ్చినవారిని ప్రోత్సహించడంతో వచ్చే ఎన్నికల్లో తన సత్తా చూపిస్తానని ఆయన బహిరంగంగానే సవాలు చేస్తున్నారు. అదే నియోజకవర్గంలో క్వారీ లీజుకు తీసుకున్న పార్టీ నీటి సంఘం అధ్యక్షుడిని, క్వారీ పనులను అడ్డుకున్న వైనం కూడా పార్టీ దృష్టికి వెళ్లింది. ఇక చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికల్లో పార్టీ, కులాభిమానంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్న సానుభూతిపరులకు చెందిన క్వారీలన్నీ మైనింగ్ అధికారుల పేరుతో నిలిపివేయడం కూడా వ్యతిరేకతకు కారణమవుతోంది. మరికొందరు ఎమ్మెల్యేలు మార్కెటింగ్ యార్డు, జిల్లాస్థాయి పదవుల సిఫార్సుల విషయంలో
పోస్టులు అమ్ముకుంటున్నారన్న విమర్శలున్నాయి. మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, తహసీల్దార్, సీఐ, ఎస్‌ఐ, డీఎస్పీ వంటి పోస్టింగులను అమ్ముకుంటున్న క్రమంలో, ఆ పోస్టుల్లోకి వచ్చినవారు పార్టీ కార్యకర్తలని కూడా చూడకుండా డబ్బులిస్తేనే పనిచేస్తామంటున్న వైనం కూడా కార్యకర్తల్లో కొందరు ఎమ్మెల్యేలే కారణమని చెబుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో సొంత ఖర్చులు పెట్టయినా ఓడిస్తామని నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల విచ్చలవిడి అవినీతి చర్యల వల్ల కూడా పార్టీ నష్టపోతోందన్న నివేదికలొచ్చాయంటున్నారు. ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుంటూరు జిల్లాలో గురజాల, పెదకూరపాడు, రేపల్లె, చిలకలూరిపేట, తెనాలి, పొన్నూరు, వినుకొండ వంటి నియోజకవర్గాల్లోనే పార్టీ గెలుస్తుంది. మిగిలినచోట్ల అభ్యర్థులను బట్టి విజయావకాశాలుంటాయి. వీరిలో కొందరిపై ఆరోపణలున్నా వారికి ప్రతిపక్షం నుంచి ప్రత్యామ్నాయం లేకపోవడం కూడా సానుకూల అంశమ’ని ఓ సీనియర్ నేత విశే్లషించారు. మరికొందరు ఎమ్మెల్యేలపై నేరుగా ఆరోపణలు లేకపోయినప్పటికీ ఇప్పటివరకూ తమ పనితీరు మెరుగుపరుచుకోలేకపోవడం, అందుబాటులో లేకపోవడం, లెక్కలేనితనం, సొంత వ్యాపారాల్లో మునిగిపోయి పీఏలు, కుటుంబ సభ్యులకు నియోజకవర్గాలను అప్పగించిన వైనం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణంగా తేలింది. ఈ తరహా ఎమ్మెల్యేలు 30మంది వరకూ ఉండవచ్చంటున్నారు. ఈ కారణాల దృష్ట్యా కనీసం 60 మంది ఎమ్మెల్యేలను మారిస్తేనే పార్టీకి మనుగడ అని స్పష్టం చేస్తున్నారు.
కాగా, ఎమ్మెల్యేల చర్యలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ చంద్రబాబుపై వ్యక్తిగతంగా సానుకూలత కనిపిస్తోందని, అయితే అది అభ్యర్థులను మారిస్తేనే విజయం రూపంలో అందుతుందని పలు నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. బాబు కష్టపడుతున్నారన్న అభిప్రాయం తటస్థులతో పాటు యువకుల్లో ఎక్కువగా ఉంది. దానికి కొంత మీడియా సహకారం కూడా కారణం. 2004లో టీడీపీని కచ్చితంగా ఓడించాలన్న కసి, పట్టుదల ఇప్పుడు లేదని, దాదాపు అన్ని కులాలకు ఏదో ఒకరకంగా లబ్ధి జరుగుతుండటమే దానికి కారణమని తేలింది. ఉద్యోగుల్లో తమ చేత బాబు మళ్లీ పనిచేయిస్తున్నారన్న అసంతృప్తి కొంతమేరకు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయంగా ఆయన వైపే చూస్తున్నారని తేలింది.
పలు సర్వేల నివేదిక ప్రకారం ప్రధానంగా పింఛన్లపై 80 శాతం సంతృప్తి ఉందని, జన్మభూమి కమిటీలపై మాత్రం వ్యతిరేకత ఉందని తేలింది. ఒక్కో నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారుల సంఖ్య సగటున నెలకు 10 నుంచి 15 మంది వరకూ ఉండటంతో లబ్ధిదారులు చేస్తున్న వౌఖిక ప్రచారం కూడా పార్టీకి కలసివస్తోంది. బాబు పాలనపై సానుకూలత ఉన్నా స్థానిక ఎమ్మెల్యేల చర్యల వల్ల అది ఓట్ల రూపు దాల్చడం అనుమానమే. అభ్యర్థిని మారిస్తేనే తప్ప ఆ వ్యతిరేకత సానుకూలత కాదన్నది స్పష్టమవుతోంది. అయితే మీడియాలో వచ్చే వ్యతిరేక కథనాలపై ప్రజలు ఆసక్తికనబరుస్తున్నారు. గ్రామాల్లోని దళితవాడలు, పట్టణాల్లోని జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే చిన్నపాటి హోటళ్ల వద్ద ఇలాంటి చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆరోజు, అంతకుముందు రోజు ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేక వార్తలు ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తున్నట్లు తేలింది. ‘ఇదంతా నిజమే అయినప్పటికీ అభ్యర్థులను మార్చడం వేరు. మార్చగలడం వేరు. కొంతమందిపై ఆరోపణలున్నా అక్కడ సరైన ప్రత్యామ్నాయం లేకపోవచ్చు. కొంతమందిని మొహమాటం కోసమైనా మార్చలేరు. ఇక ఎందుకూ పనికిరారనుకుంటే మార్చక తప్పదు. 2004 నాటి మాదిరిగా బాబును కచ్చితంగా దింపాలన్న కసేమీ లేదు. అలాగని అప్పటి వైఎస్ మాదిరిగా ఇప్పుడు జగన్‌ను సీఎంను చేయాలన్న పట్టుదలా లేదు. కనీసం 60 మందినైతే మార్చాలి. అది ఎలాగన్నదే చూడాలి. వైఎస్ మాదిరిగా మా సార్ అంత సాహసం చేస్తారో, లేదో చూడాల’ని ఓ సీనియర్ నేత విశే్లషించారు.